డిసెంబర్ 15, 2018
కవులు, రచయితలకు ప్రతిలిపి సత్కారం
అందరికి నమస్కారం,
కవులను,రచయితలను ప్రోత్సహించడం కొరకు గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా “కవులు – రచయితలకు ప్రతిలిపి వారి పట్టాభిషేకం” శీర్షికతో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. ఇందుకు గాను మీరు చేయవలసిందల్లా మీ రచనలు మీరే స్వయంగా ప్రతిలిపిలో స్వీయ ప్రచురణ చేయడమే. మీ రచనలు ప్రతిలిపిలో ప్రచురణ చేయండి లక్షల పాఠకులను పొందండి.
తెలుగు సాహిత్యానికి కృషి చేస్తున్న ఎందరో కవులను,రచయితలను ప్రతిలిపి గత సంవత్సరం సత్కరించుకుంది. అది మా బాధ్యతగా స్వీకరిస్తూ ఈ సంవత్సరం కూడా మరికొంతమందిని గౌరవించుకోవాలనుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ శీర్షిక పెట్టడం జరిగింది.
గడువు : అక్టోబర్ -5 -2018 నుండి ఫిబ్రవరి – 15 -2019 దాక రచనలు స్వీయ ప్రచురణ చేయాలి.
ఇచ్చిన గడువు లోపు రచనలు ప్రచురణ చేస్తే :
1.ప్రతిలిపిలో స్వీయ ప్రచురణ ద్వారా 10 కథలు లేదా 10 వ్యాసాలు ప్రచురణ చేస్తే ప్రతిలిపి నుండి ప్రోత్సాహక ప్రశంసా పత్రం అందజేయడం జరుగుతుంది.
2.ప్రతిలిపిలో స్వీయ ప్రచురణ ద్వారా 50 కథలు లేదా 50 వ్యాసాలు ప్రచురణ చేస్తే ప్రోత్సాహకప్రశంసా పత్రంతో పాటు ప్రతిలిపి కథా విశారద/ వ్యాస విశారద పేరుతో సత్కరించుకోవడం జరుగుతుంది.
3.ప్రతిలిపిలో స్వీయ ప్రచురణ ద్వారా 50 కవితలు ప్రచురణ చేస్తే ప్రతిలిపి నుండి ప్రోత్సాహక ప్రశంసా పత్రం అందజేయడం జరుగుతుంది.
4.ప్రతిలిపిలో స్వీయ ప్రచురణ ద్వారా 100 కవితలు ప్రచురణ చేస్తే ప్రతిలిపి నుండి ప్రోత్సాహక ప్రశంసా పత్రంతో పాటు కవితా ప్రవేశిక పేరుతో సత్కరించుకోవడం జరుగుతుంది.
5. ప్రతిలిపిలో స్వీయ ప్రచురణ ద్వారా 200 కవితలు ప్రచురణ చేస్తే ప్రతిలిపి నుండి ప్రోత్సాహక ప్రశంసా పత్రంతో పాటు కవితా విశారద పేరుతో సత్కరించుకోవడం జరుగుతుంది.
పై తెలిపిన సత్కారాలు గత ఏడాది లాగే సభ ఏర్పాటు చేసి సత్కరించుకోవడం జరుగుతుంది. మరిన్ని వివరాలు ఫిబ్రవరి-15 తర్వాత తెలియపరుస్తాము.
నియమాలు :-
1.ప్రతి రచయిత అన్ని విభాగాలలో మీ రచనలు ప్రచురణ చేయవచ్చు. రచనలు మీ సొంతం అయ్యి ఉండాలి.
2. పూర్వం ప్రతిలిపిలో ప్రచురింపబడిన రచనలు ప్రచురణ చేయరాదు. వేరే ఎక్కడైనా ప్రచురణ అయినవి స్వీకరించబడును.
3. యూనికోడ్ కాకుండా ఇతర ఏ ఫార్మాట్ వెబ్ సైట్ లో అప్లోడ్ చేయలేరు కనుక మీ రచనలు యూనికోడ్ లో మాత్రమే స్వీయ ప్రచురణ చేయగలరు.
ముఖ్య గమనిక : మీ రచనలు మెయిల్ లో పంపరాదు మీరే స్వీయ ప్రచురణ చేయాలి. స్వీయ ప్రచురణ యాప్ నుండి ఎలా చేయాలో క్రింది లింక్ లో ఉన్నది గమనించగలరు.
https://telugu.pratilipi.com/story/SDnkNsasz1lS
సందేహాలకు : మెయిల్ – telugu@pratilipi.com మొబైల్ – 7259511956 వాట్స్ యాప్ : 9491977190
ధన్యవాదములు
ఇట్లు,
మీ భవదీయుడు
జాని.తక్కెడశిల ,
ప్రతిలిపి (తెలుగు విభాగం,రచయితల అనుసంధాన కర్త )
బెంగళూరు
మొబైల్ –7259511956
watsup:9491977190
ప్రతిలిపి యాప్ డౌన్లోడ్ కొరకు లింక్ పై క్లిక్ చేయండి http://goo.gl/xXSuaO
Leave a Reply