జనవరి 29, 2019

కథలకు ఆహ్వానం

Posted in సాహితీ సమాచారం, Uncategorized at 6:07 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

సంచిక-సాహితీ ప్రచురణలు వెలువరించే రెండవ కథల సంకలనం క్రీడ కేంద్ర బిందువుగా ఉన్న కథలను ఒక చోట చేరుస్తుంది. అంటే, ఉగాదికి విడుదలయ్యే కథల సంకలనం క్రీడ కథల సంకలనం అన్నమాట.
రైలుకథలు , దేశభక్తి కథలు, తెలుగుకథల్లో మహాత్మా గాంధీ కథల సంకలనం తరువాత కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్ళి మురళీమోహన్ రూపొందిస్తున్న నాలుగవ కథల సంకలనం ఇది.
క్రీడలు కేంద్ర బిందువుగా సృజించిన తెలుగు కథల సంకలనం తయారీలో తోడ్పడండి. క్రీడలు కేంద్ర బిందువుగా ఉన్న కథలు మీకు తెలిసినవి వివరాలు చెప్తే ఆ కథలను సంకలనంలో ప్రచురణకు పరిశీలిస్తాము. అలాగే మీరు రాసిన కథలుంటే, ప్రచురితమయినా, అముద్రితమయినా, పంపిస్తే వాటినీ ప్రచురణకు పరిశీలిస్తాము. అముద్రితమయిన కథలను సంచిక వెబ్ పత్రికలో ప్రచురిస్తాము. ఒకవేళ ఈ సంకలనం కోసం ప్రత్యేకంగా కథ రాసి పంపితే, వాటినీ పరిశీలిస్తాము. ఒకవేళ ఆ కథ మేము అనుకున్న పరిథిలో ఇమడకపోతే, దాన్ని సంచిక పత్రికలో ప్రచురిస్తాము.
కథను పరిశీలనకు పంపటమే, వాటి ప్రచురణకు అనుమతిగా భావిస్తాము.

కథలు పంపవలసిన ఆఖరు తేదీ- మార్చ్-10.
కథలను మెయిల్ ద్వారా అయితే kmkp2025@gmail.com కు, వాట్స్ ఆప్ ద్వారా అయితే- 9849617392 కు,
కొరియర్/పోస్ట్ ద్వారా అయితే,
PLOT NO 32, H.NO 8-48, RAGHURAM NAGAR COLONY, ADITYA HOSPITAL LANE, DAMMAIGUDA, HYDERABAD-83 కు పంపించండి.
ఇతర కథా సంకలనాలను విజయవంతం చేసినట్టే, ఈ సంకలనం కూడా విజయవంతమవటంలో తోడ్పడండి.

Leave a Reply

%d bloggers like this: