ఫిబ్రవరి 25, 2019

పలకరింపుః మునాసు వెంకట్

Posted in సాహితీ సమాచారం at 12:55 సా. by వసుంధర

1 వ్యాఖ్య »

 1. *అచ్చ తెలంగాణ మాండలిక కవి మునాసు వెంకట్*

  ఐ.చిదానందం
  ———————————————————————–

  ఏ కవి అయినా తాను అనుభవించిన వాతవరణంనే కవిత్వంగా రాస్తాడు. అలాంటి బహుముఖ వ్యక్తికరణతో వైవిద్యమైన కవిత్వం రాసినవారు మునాసు వెంకట్.

  నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం బండపాలేం గ్రామం లో జన్మించారు ఎమ్.వెంకట్. యువ రచయితల సమితి ద్వారా సాహిత్యం పై ఆసక్తి పెంచుకున్నారు. వెంకట్ గారి ఇంటికి దగ్గర్లో సాహితీ మేఖల అంబడిపూడి వెంకటరత్నం గారు వుండటం వల్ల సాహిత్యాభిలాష ఇంకా మెండుగా అయ్యింది వీరికీ.

  *వీరి రచనలు*
  * ఎన (1999)
  * వర్జీ (దీర్ఘ కవిత-2000)
  * మెద

  *వీరి కవితలు కింది సంకలనాలలో కలవు*
  * చిక్కనవుతున్న పాట
  * పదునెక్కిన పాట
  * బహువచనం
  * మేమే
  * మొగి

  వీరి కవిత్వం విషయం కు వస్తే ఎన కవితా సంపుటిలో మత్య్సకారుల జీవితాలను వర్ణించారు. జాలర్ల జీవితం అనేది ప్రపంచీకరణలో మార్కెట్ విలువలో మారుతున్న సంధర్భంలో వీరి కవిత చూడండీ

  నా ఒంటి మీద బిగుసుకు పోయే
  నైలాన్ తాళ్ళ నాగరికతలో
  గిలగిల కోట్టుకోంటున్న చేపనై

  అంటూ వలలో పడ్డ చేప వలే జాలర్ల జీవితం వుందని చేబుతారు. గంగమ్మ అనే కవితలో చేపలు అమ్మే స్త్రీ వర్ణన చూడండీ

  చేపల తట్టా మోస్తూ అమ్మ
  వంటి నిండా నీసు అమ్ముకుని
  ఉప్పు చారలతో మెరుస్తూ
  తీరం వెంట నడుస్తున్న సముద్రంలా

  ఇక్కడ చేపల తట్టా, ఉప్పుచారలు, సముద్రం ఇవన్నీ కూడా చేపలు అమ్ముకుని జీవించే మాతృమూర్తిని ఎలివేట్ చేయుటకు నడుస్తున్న ఆమెలో ఎన్నో ఆలోచనలు సముద్రంలా. ఇక్కడ సముద్రంలో ఎన్నో తుఫానులు ఉన్నా పైకి ప్రశాంతంగా వుంటుంది. ఇక్కడ స్త్రీ కూడా అంతే.
  నదిని నమ్ముకుని బతికే జీవితాలు ఒక్కోక్కసారి నదిలో కలిసిపోవచ్చు. అక్కడ ప్రజలను వరద నీటి కోట్టుకుపోవచ్చు. అక్కడ ప్రజలను వరద నీటి తర్వాత పరిస్థితి ఏమాంటారో చూడండీ. గత్తరోచ్చి కోట్టుకుపోయినట్లైందీ బిడ్డా ఊరు… అనీ మాతృమూర్తి సమాధానం.
  వరద వచ్చినప్పుడు ప్రభుత్వం అంచనా బృందం పంపడం సమాజం. వారు ఇచ్చే అరకోర డబ్బులు నమ్ముకునే స్థితిలో అక్కడి ప్రజలు వుండరు. అసలు ఆ డబ్బులు వారికీ చెరుతాయో కూడా తేలీదు.

  అంచనా బృందమేుకటి
  అమ్మ ను అడుగుతుంది
  మీకు ఏమన్నా
  పంట భూములున్నాయా.!
  లేదు సముద్రముందీ

  అంటుంది ఆ స్త్రీ అమాయకంగా.ఇలా హృదయాన్ని ద్రవించే మాటలు ఆలోచనలను తవ్వే పదాలు రాయడం వీరి కవిత్వం శైలి. ఇక్కడ స్త్రీ కీ ఆస్తులు లేవు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులపై నమ్మకంలేదు. సముద్రంను నమ్ముకుని జీవిస్తారు. సముద్రం ముంచినా తేల్చినా అదే వారికీ ఆస్తి. మరో కవితలో

  ఎవడేన్ని మాటలన్నా
  చాకిరీతోనే అమ్మ
  దునియా తో మాట్లాడుతుంది
  అమ్మ జీవితం నిండా చాకిరీయే

  పై కవితలో అమ్మ చాకిరీతోనే మాట్లాడుతుంది అనే పదం కరుకు గా అనిపించినా అక్కడ ఆ తల్లి శ్రమను గాఢత ను తెలుపుతుంది.మరో కవితలో…

  ఎనక్కి ముందుకీ
  ఎద్దు తో ఎద్దు
  మూడో ఎద్దు మా తాత

  దీంట్లొ చూడండీ పోలం దున్నే తాత మూడో ఎద్దులా కనిపిస్తున్నాడనీ చెప్పడం మెటఫర్( Like రూపక అలంకారం)
  తెలంగాణ ఉద్యమ సమయం లో కూడా వీరి కవిత్వం సుతిమెత్తని ఆగ్రహం ప్రకటించారు.

  ఎన్నికరాలుంటేనేమి నేల
  ఎంగిలి నాలుకంత గాదు
  నెత్తి మీద మబ్బులు లేవు
  కాళ్ళ కింద కాల్వల్లేవు

  మరో కవితలో రైతు అత్మహత్యలపై….

  కోట్టంలో గుంజకు
  రుమాలు
  కోత్త పసరం

  మరో కవిత వానలుల్లేక నీటి సంపద లేక ప్రజలు ఎలా బాధపడ్తారో మట్టి కుంపటి కవితలో చెబుతారు.
  ఎన కవితా సంపుటి దళితుల ఆక్రందనను, ఆవేదనను, ఆగ్రహం ను కూడా తెలిపినది.బ్యాలెట్ బ్యాండు ; political dimenstion వంటి ఆంగ్ల పదాలు మనకు కనిపిస్తాయి. ఒకచోట దళిత శక్తిని గురించి చెబుతూ కోమ్ములున్న మందలో వేరే ఆయుధమేందుకు అంటారు కవి. మరో కవిత లో……
  ఈ మట్టి తడవాలి
  ఈ మట్టి తడవనీ
  ఈ మట్టి తుడవడానికీ
  చేతికీ మట్టంటకుండా ఉండలేం

  మెద కవితా సంపుటిలో ఊరు నేపధ్యంలో వచ్చిన వీరి కవితా చూడండీ….

  కరువెనుకకరువు వచ్చినా
  ఊళ్లే మొకం సోర బాదినా
  గత్తర వచ్చినా
  రజాకార్లు దండెత్తివచ్చినా
  గడీల మీద దోర హుంకరించినా
  భయపడ లేదుగా
  ఒక్కోక్క పిల్లగాల
  జీవి తీసుకుంటున్నడు
  ఎందుకో కోడుకగిప్పుడు భయమేస్తుంది
  నా సావు గురుంచి కాదురా వేంకన్న

  వీరి కవిత్వంలోని పదాలు ప్రామాణిక బాష లో కాకుండా మధురమైన మాండలికభాష మూల భాష లో ఉంటుంది. నీళ్ల కోసం విలపించే నల్లగోండ గోడును…

  రాజులు రాల్లేసి పోతుంటే
  కండ్లల్లో నీళ్లు పై కోచ్చే

  అంటూ నీళ్ల కష్టాలను చేప్పుతారు.

  *వీరి కోన్ని కవితలు*

  మేనమామ అంటే
  నాకు అమ్మ తోడ వచ్చిన ఇనాం
  అమ్మ కళ్లలో నీళ్లు మసులుతున్నప్పుడు
  బియ్యం తెచ్చిన మామ
  ఇప్పుడు గోంతులో పోరబోతున్నాడు

  *మేన చందమామ*

  కలవరిచ్చి కలవరిచ్చి
  నోసలు సాల్లల
  పేగు తీగకింద పడ ఉన్నావే పేద్ది
  ఊరు నిలిసింది మట్టి
  మనాది పేట్టుకుంది
  ఎక్కిల్ల సప్పుడాయే
  ఎడనించే పేద్ది
  *ఎక్కిల్లు*

  ఏమున్నదనీ నా దగ్గర
  తోట్టే లో మట్టి
  ఉట్టిలో నక్షత్రాలు
  దూరం మీద అరి పాదాల దాడి
  నెత్తి మీద పోద్దే కిరీటం

  ఎన లో దారా ; పుదీన గంప ; ముత్తాసిది ; కలికుండ మరియు మెదలో ఇగం ; కయాలు ; దమ్మున గోయ్య ; కామంచి వంటి పదాలతో కవితా శీర్షికలు కలవు.ఇగం ; కోయలు ; ఎక్కిల్లు ; శిక్కుడు సంచి ; మెద ; నేసరు వంటి చాలా మందికీ తేలియని ఎన్నో తెలంగాణ పదాలు వీరి కవిత్వం లో మనం చూడవచ్చు. ఈ పదాలు చూస్తే మాండలిక పదాల గోప్పదనం తెలుస్తుంది. వీరి కవిత్వంలోని పదాలు ప్రామాణిక బాష లో కాకుండా మధురమైన మాండలికభాష మూల భాష లో ఉంటుంది. నిఘంటువులలో ఎక్కని పదాలు ఎన్నో వీరి కవిత్వం లో కలవు.

  అప్పట్లో వేంకట్ గారు వాస్తవి కలం పేరు తో వ్యాకరణం ప్రభాకర్; విష్ణు భరద్వాజ్ లతో కలిసి రేపటి కవితలు అనే సంకలనం తెచ్చారు. అలాగే 1997 లో గోసంగి ; నీలి సాహితి వంటి సంస్థలను మిత్రులతో కలిసి ఏర్పరిచినారు. ఇంకా 9-మంది కవులతో కలిసి మొగి అనే కవితా సంకలనం వెలువరించినారు.

  వెంకట్ గారి వీరి కవిత్వం తెలంగాణ తోటలో విరబూసిన మల్లెలు పదునైన మాండలికలతో బరువైన కవిత్వం రాయడం వీరి శైలి. మునాసు వెంకట్ శైలి జానపదం కు దగ్గరదీ. వీరి కవిత్వం లో రూపకాలు ఎక్కువ . అందుకే వీరి కవిత్వం మనకు కోత్తగా తాకుతుంది.

  * ఐ.చిదానందం *
  చరవాణి – 8801444335


Leave a Reply

%d bloggers like this: