మార్చి 4, 2019
విద్యార్థులకు కవితల పోటీ
వాట్సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో
వసుంధర విజ్ఞాన వికాస మండలి
(సామాజిక, సాంస్కృతిక యువ చైతన్య వేదిక)
8వ,కాలనీ, గోదావరిఖని. పెద్దపల్లిజిల్లా, తెలంగాణ రాష్ట్రం
పాఠశాల విద్యార్థులకు కవితల పోటీలు
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రస్థాయిలో పాఠశాల విద్యార్థులకు కవితల పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ పోటీలలో పాల్గొనువారు పదవతరగతి లోపు విద్యార్థులై ఉండాలి.‘భారత్ ప్రణామ్-జవాన్ సలామ్’ అనే అంశంపై 20 లైన్లకు మించని వచన కవితలను విద్యార్థిని విద్యార్థుల నుండి ఆశీస్తున్నాము. కవిత తమ స్వంతమనే హామీ పత్రంతో పాటు, పాస్ పోటో జతచేసి ఏ4 పేపరుకు ఒకవైపు మాత్రమే రాసికానీ, డిటిపి చేసి కానీ పంపవచ్చు. కవిత పంపేవారు ఏ పాఠశాలలో చదువుతున్నారో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుల దృవీకరణ తప్పనిసరి. లేనిచో కవితను పోటీకి స్వీకరించం. మాకు వచ్చిన కవితల్లో ఐదు ఉత్తమ కవితలను ఎంపికచేసి వారికి సమాన బహుమతులు అందజేస్తాం. కవితలు మాకు చేరాల్సిన చివరితేది మార్చి 20, 2019. పోటీల నిర్వహణలో తుది నిర్ణయం నిర్వహకులదే.
కవితలు పంపాల్సిన చిరునామా
సి.హెచ్. వెంకటరెడ్డి, అధ్యక్షులు
వసుంధర విజ్ఞాన వికాస మండలి
ఇంటినెం-16-1-238, శివాజీనగర్, గోదావరిఖని-505209, పెద్దపల్లి జిల్లా.
సంప్రదించాల్సిన పోన్ 9182777409, 9989078568
మధుకర్ వైద్యుల చదువు వెంకటరెడ్డి కట్కూరి శంకర్
వ్యవస్థాపకులు అద్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్
Leave a Reply