మే 17, 2019
సినిమా-సాహిత్యం సమీక్షల పోటీ – ప్రతిలిపి
సాహిత్యం-సినిమా
అందరికీ నమస్కారం,
ఒక విషయం పట్ల రకరకాల వ్యక్తులకు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాల వెనుక విశ్లేషణలు ఉంటాయి. ఒక విషయం కొందరికి నచ్చుతుంది మరి కొందరికి నచ్చదు. మీ అందరి సహేతుకమైన అభిప్రాయాలను సమీక్ష, విమర్శ రూపంలో ఆహ్వానిస్తున్నాము.
మీకు నచ్చిన సినిమా, కథ, నవల, పుస్తకం, సాహిత్య ప్రక్రియ, సినిమా ఇలా ఏదైనా కానీ మీ అభిప్రాయాలను సమీక్ష లేదా విమర్శ రూపంలో మాకు అందివ్వండి. తెలుగు సాహిత్యంలో సమీక్ష, విశ్లేషణ, విమర్శ తగ్గిపోతున్నాయి ఆ లోటును పూడ్చడానికి మా వంతు కృషి చేయడానికే ఈ పోటీని నిర్వహిస్తున్నాము.
కేవలం రచయితలే కాదు పాఠకులు కూడా ఇందులో పాల్గొన వచ్చు. మీకు నచ్చిన లేదా నచ్చని సినిమా, పుస్తకం, కథ, నవల మీద మీ అభిప్రాయాలు రాయండి. మీ విలువైన అభిప్రాయాలు ప్రపంచానికి బహిర్గతం చేయండి.
ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు క్రింది విధముగా ఉంటాయి:-
మొదటి బహుమతి :- 3000
రెండవ బహుమతి :- 2000
మూడవ బహుమతి :- 1000
నియమాలు :-
1)ప్రతి రచయిత/ పాఠకుడు ఐదు రచనల వరకు పోటీకి సబ్మిట్ చేయవచ్చు. రచనలు పూర్తిగా మీ సొంతమై ఉండాలి.
2)పూర్వం ప్రతిలిపిలో ప్రచురింపబడిన మీ రచనలు పోటీకి సబ్మిట్ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణ అయినవి సబ్మిట్ చేయవచ్చు.
3)సాధ్యమైనంత వరకు అక్షర దోషాలు లేకుండా చూసుకోండి.
ముఖ్యమైన తేదీలు :
1)మీ రచనలు సబ్మిట్ చేయడానికి చివరి తేది జూన్-02-2019
2)జూన్-03-2019 అందరి రచనలు ప్రచురణ చేసి అదే రోజు ఫలితాలు ప్రకటించే తేదిని తెలుపబడును.
పోటీలో పాల్గొనే పద్ధతి :-
1)ఈ పోటీకి మీ రచనలను సమర్పించడానికి క్రింద ఉన్న “పాల్గొనండి” బటన్ పై క్లిక్ చేయండి.
2)మీ రచనను “ఇక్కడ రాయండి” అనే చోట మొదటి రచనను పోస్ట్ చేసి అప్లోడ్ సింబల్ పై క్లిక్ చేయండి.
3)రచన యొక్క శీర్షిక రాసి “తరువాత” అనే బటన్ పై క్లిక్ చేయగానే రచనకు తగ్గ ఫోటో అప్లోడ్ చేయడానికి “+” సింబల్ పై క్లిక్ చేసి ప్రతిలిపి ఫోటో గ్యాలరి మీకు నచ్చిన మరియు రచనకు సరిపడిన ఫోటో జతచేయండి.
4)ఫోటో జతచేసి “తరువాత” అనే బటన్ పై క్లిక్ చేసి విభాగంలో “వ్యాసం”, వర్గంలో మీ రచన యొక్క వర్గం “సమీక్ష” సెలెక్ట్ చేసి రచనను సబ్మిట్ చేయండి.
5)అలాగే మీ రెండవ రచన, మూడవ రచన, నాల్గవ రచన, ఐదవ రచన కూడా సబ్మిట్ చేయగలరు.
ఫలితాలు ప్రకటించే పద్ధతి :
మా న్యాయనిర్ణేతలు వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకొని విజేతలను ఎంపిక చేయడం జరుగుతుంది.
సందేహాలకు : మెయిల్ – telugu@pratilipi.com
Leave a Reply