జూలై 16, 2019

కథలు, కవితలు, కార్టూన్ల పోటీ ఫలితాలు – కెనడా డే తెలుగుతల్లి

Posted in కథల పోటీలు at 8:05 సా. by వసుంధర

2019కెనడా డే పోటీ ఫలితాలు
అందరికీ నమస్కారము.
కెనడా డే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు. 
కుప్పలు తెప్పలుగా వచ్చిన కథల్లోంచి కొన్ని మాత్రమే ఏరడమంటే ఎవరికీ ఇష్టముండదు ఎందుకంటే అది చాలా కష్టం కూడా.. అయినా తప్పదు. ఆఖరి నిముషం వరకూ అయ్యో ఈ కథ బాగుంది దీన్ని వదలడమెలా , ఈ కవిత బాగుంది దీన్ని వదలడమెలా అనిపిస్తూ.. ఒక సమయం లో గుండె గట్టి చేసుకుని కొన్ని వదిలేయాల్సిన పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరుకునే కమిటీ మాది. కానీ తప్పదు కదా మరి.
వచ్చిన కథలని పేర్లు లేకుండా జడ్జీలకి పంపి వారి నిర్ణయం ప్రకారం విజేతలని నిర్ణయించడం జరిగింది. గత యేడాది చెప్పుకున్నట్టు పోటీ ఫలితాలు చాలా పారదర్శకంగా, నిష్పక్షపాతం గా జడ్జీలు ఏకాభిప్రాయం కలిగి ఉన్న కథలని మాత్రమే ఎంపిక చెయ్యడం జరిగింది. 
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఇక్కడ పేరు కనబడకపోతే కథ బాగలేదనో వెనుకబడిందనో కాదసలు. 1:4 నిష్పత్తిలో వచ్చాయి కథలూ కవితలూ . కాబట్టి మనసు నొచ్చుకోకుండా ఉండాలని అభ్యర్థిస్తున్నాము, ఆశిస్తున్నాము.

మనము ప్రతి సంవత్సరమూ పోటీలు నిర్వహిస్తున్నామంటే, దాని వెనక ఎన్ని చేతులుండాలో కదా.. ఆ చేతులు బంగారు చేతలు చేసేఅందమైన చేతులు. 
పోటీలలో విజేతలకి బహుమతులు అందజేస్తున్న ముదునూరు కుటుంబానికి, తమిరిశ కుటుంబానికి, వంక కుటుంబానికి, ఎర్రమిల్లి కుటుంబానికి, ముదిగొండ కుటుంబానికి, ఉపాధ్యాయుల కుటుంబానికి, చిల్లర కుటుంబానికి, పూడూరి కుటుంబానికి, రాయవరపు కుటుంబానికి, గన్నవరపు కుటుంబానికి, శ్రీమతి స్వాతి పావని గారికి, శ్రీమతి రత్నమాధవి రాయవరపు గారికి, శ్రీమతి శ్రీవాణి ముప్పాళ్ళ గారికి వేనవేల కృతజ్ఞతలు.

ప్రతినెలా వచ్చిన కార్టూన్లని అందంగా పత్రికలో అమరుస్తున్న పబ్లిషర్ శ్రీ రామకృష్ణ పుక్కళ్ళ గారికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

గత సంవత్సరము బహుమతి పంపకం లో జరిగిన జాప్యానికి మన్నించమని కోరుతూ ఈ సంవత్సరం ఏ నెల ప్రచురించిన రచనలకి ఆ నెల బహుమతి పంపడానికి నిశ్చయించాము. ఈ విధంగా చెయ్యడం వలన గతం లో లా అపశృతులు చోటు చేసుకోవని మా నమ్మకము.

మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం అత్యుత్సాహం గా 64 కార్టూనిస్టులు వారి కార్టూన్ లను పంపారు. ఇది అపురూపమైన విషయం కాబట్టి ఈ సంవత్సరం వారందరినీ సమానంగా గౌరవించుకోవాలని కమిటీ నిర్ణయించే సమయంలో కొండపల్లి బొమ్మల కళాకారుల గురించి ఒక వ్యాసం దృష్టిలోకి వచ్చింది. ఈ రెంటినీ కలగలిపి, కార్టూన్ ల బహుమతుల కోసం వచ్చిన మొత్తం కాకుండా కొండపల్లి కళాకారులను కూడా ప్రోత్సహించే సదుద్దేశ్యంతో మిగిలిన కార్టూన్ విజేతలందరికీ కొండపల్లి బొమ్మలని బహూకరించాలని నిర్ణయం తీసుకోవడమైనది.

అందరికీ అనేక ధన్యవాదాలతో 
తెలుగుతల్లి కమిటీ సభ్యులు: 
శ్రీ పూడూరి విజయ భాస్కర రెడ్డి గారు, 
శ్రీ గంగాధర్ సుఖవాసి గారు
శ్రీమతి సరోజ కొమరవోలు గారు , 
శ్రీమతి కళ పిళ్ళారిశెట్టి గారు , 
శ్రీమతి లక్ష్మి రాయవరపు గారు మరియు 
లయన్ విమలా ప్రసాద్ గుర్రాల గారు

కథల పోటీలు: (1,000 రూపాయల చొప్పున)
శ్రీమతి ముదునూరు వసంతకుమారి రామమూర్తి రాజు గారి స్మారక బహుమతులు 
శ్రీమతి వాడ్రేవు శేషమ్మ పాపయ్య పంతులు గారి స్మారక బహుమతులు 
శ్రీమతి రాయవరపు లక్ష్మీ రాజారావు గారి స్మారక బహుమతులు 
శ్రీమతి వంకా రాజేశ్వరీ వెంకట రత్నం గారి స్మారక బహుమతులు 
శ్రీ శ్రీనివాస ఉమా శంకర్ సరస్వతుల గారి స్మారక బహుమతులు 
శ్రీమతి ఎర్రమిల్లి సత్యవతీ వెంకట రత్నం గారి స్మారక బహుమతులు

దేవుడు ఇచ్చిన జీవితం Smt. Anuradha Yalamarti
పండుగ Smt. Ashwini Pemmaraju
ఆపేక్ష Sri. Durgaprasad Devulapalli
ప్రేమాశ్రమం Smt. Girija Peesapaati
గెలుపుకు సూత్రం Smt. Hymavathy Pebbali
బావాబావా పన్నీరు Smt. Hymavathi RS
నట్టింటి చీకటి Smt Jyothirmayi Malla
ఒక్కక్షణం ఆలోచిద్దాం Sri. Kasivishwanath Patrayudu
గురుదేవోభవ !. Sri. krishna swamy raju rc
ఉత్తరం Sri. Krupakar Potula
అమృత Sri. Lakshman Rao KV
అమ్మ కోరిక Smt. Lakshmi Mulugu
నేను అమ్మను Smt. Lakshmi PSM
ఆమె ఒక శక్తి Smt. Lakshmi Raghava
పరివర్తన Smt. Madhupatra Shailaja Uppaluri
అనుకోని కష్టం Smt. Manga Ratnam p
అమ్మతనం Smt. Meenakshi Srinivas
మనమే బాధ్యులం Sri. Nageswara rao Bondala
గర్భశోకం Smt. Praveena Monangi
జీవనకారుణ్యం Sri. Rajesh Yaalla
బదిలీ Sri. Ramalakshmi Jonnalagadda
క్రొత్త పరువు Sri. Sankar Sankisha
అన్నదాత -సుఖీభవ” Smt. Sounjaynya Yaadati
వాగార్దావివసంతృ ప్తౌ.. Smt. Sujanadevi Naamani
“స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ … Smt. Suryalakshmi Chellapilla
ప్రాప్తమున్న తీరానికి.. Sri. Suryanarayana sarma G
ఆ కన్నీళ్లకు చితిమంటలారవు… Sri. Udayababu Kottapalli
బడిలో ఏముంది ? . Smt. Usharani K
సందుగా పెట్టె .. Smt. Vani Gorthy
కిష్కిందకాండ… Sri. Vijay Appalla
మూగవైతేనేమిలే Sri Rajababu Kancharla

కవితల పోటీలు: (500 రూపాయల చొప్పున)
శ్రీ పూడూరు బాలసుబ్బా రెడ్డి గారి స్మారక బహుమతులు 
శ్రీమతి చిల్లర వెంకమ్మ వెంకటేశ్వర్లు గారి స్మారక బహుమతులు 
శ్రీమతి ఉపాధ్యాయుల దుర్గాంబా కుమారస్వామి గారి స్మారక బహుమతులు
అక్షరాలతో నేను శాశ్వతంగా Smt. Chandrakala Y
*అద్వితీయ* *బహుమతి* Sri. Durgayya baithi
తల ఎత్తుతున్నా! Smt. Geetha Srinivas
కామాఖ్య యాగం’ – Smt. Jwalitha denchanala
కవిత్వ నావ కావల్సిందే…. Sri. Ramesh Katukojwala
నాన్న… Sri. Krinshna Dondapati
“ఆలోచనలు”-. Sri. Lakshmana Murthy. V
బాల్యం ఎప్పటికీ అమూల్యమే Sri. Murthy Tarigoppula
దీపపు పురుగులు Sri. Nagraj
అర్థం-పరమార్థం Sri Phanindra Konakalla
నాతెలుగు Sri Prbhakar vairagyam
పంచభూతాలు!’ Sri. Rangarao Peyyeti
అవునూ ప్రేమ గురించి ఎందరికి తెలుసు Sri. Lakshmi Narayana Sabbani
నేను కవినా… Smt. Sailaja N
సంద్రం పిలుపు Smt. Santhi Krishna
అక్షరలక్ష్యం Sri. Sastry GLN
ఠీవి Sri. Satyam Vennela
నల్ల గులాబీలు తోట Sri. Satyanarayana Bandi
రాధ … Smitha venpati
థ్యాంక్ యూ” Sri. Sridhar Chaudaarapu
పచ్చని ప్రభానుడు Sri. Srinivasa rao Singaraaju
రాళ్ళకి పేర్లుండవు Sri subbarao eethakota
కలం కంట కన్నీరు Smt. Sujath a thimmana
చల్లని మనసుకు.. Smt. Sunanda Urimalla
నిత్య వాసంతం Smt Swarna Sailaja Danta
స్త్రీ … Smt. Swatee Sripada
తరాల అంతరం Smt.Vani Vadlamani
స్పందన Smt. Venkatamani Nyayapathi
రాలి పడుతున్న విత్తులు Sri. Venkateswar rao Anusuri

చిత్ర లేఖనం పోటీలు
శ్రీ సూరపరాజు చిన్నబ్బరాజు గారి స్మారక బహుమతులు 
శ్రీ శ్యాం రాయవరపు గారి స్మారక బహుమతులు 
1. gurram meghana 13. Harika Pothamsetti
2. SSVN Saket Sarma 14. Sahasra sindhura M
3. Suvali .ch 15. Tanvi Bathini,
4. V B Sthothra 16. Meher srujana,
5. Muddada Jyothirmayi 17. Srinika
6.Muddada Syamalata 18. RITWIKA
7. kanala Sahasra 19. pranavi gollapudi
8. Abhiram Emani 20. G. Viransh
9. Ajay Dattasai A 21. G. Sayan Amartya
10. Shreyas Bhavaraju, 22. CH. Swathi
11. Suhas Bhavaraju, 23. A.Ankith Reddy
12. B.S. Shreyas

కార్టూన్ పోటీలు
శ్రీ ముదిగొండ మల్లిఖార్జున రావు గారి స్మారక బహుమతులు
శ్రీమతి రాయవరపు జయలక్ష్మీ నరసింగ రావు గారి స్మారక బహుమతులు 
శ్రీమతి గన్నవరపు సరోజిని సత్యనారాయణ మూర్తి గారి స్మారక బహుమతులు

కార్టూన్లు

1. Vaddepalli venkatesh

2. V Parameshwar

3. Venugopal Piska

4. Vasudevarao Sathe

5. vinodkumarch ch

6. K.N.KASHYAP

7. kannajie rao

8. K Sreenivasulu

9. anand s

10. Arjun Naidu

11. APPARAO ANUPOJU

12. arisetty sudhakar

13. A. Sridhar (BACHI)

14. Anand Thopalli

15. Chalapaka prakash

16. Sita Rama Rao Jeedigunta

17. suvarna bhargavi

18. Vijay Puram

19. Srinivas Iduri

20. Prasad Kaza..

21. P V Rama Sarma

22. NAGISETTY DHEERAJA

23. Venu Gopal Galisetty

24. Dr. Putheti prabhakar

25. Bvs Prasad

26. Thota Rajendrababu

27. Rangaraju Gadiraj

28. Srirekha bakaraju

29. Yeswanth Padmanabhuni

30. machavolu rama
కార్టూన్ పోటీలలో కొండపల్లి బొమ్మలను బహుమతులు గా గెలుచుకున్న విజేతలు

Sri Ramana SV
Sri Rammohnan Zindam
Sri Ramprasad TVS
Sri ChandraSekhar K 
Sri Ramu M
Sri Chinnam Naidu S 
Sri Rangaraju Gadiraju
Sri Raviprasad Konda
Sri Gandhi Murikinati 
Sri Satyanarayana Bolem
Sri Gurunath Siddha 
Sri Siddhartha Naidu
Sri Hari venkata R 
Sri Sitarama Rao Kodali 
Smt Sridevi Peyyeti
Sri Kiran 
Sri Sreenivasa Rao Gutthula
Sri Krishna Valluri 
Sri Lakshman rao S 
Sir Meher Ravi 
Sri Murthy Jeedigunda
Sri Murthy Ponnada 
Sri Srinath Gurram
Sri Nagaraju V 
Sri Niranjan Karlapalem 
Sri Sudhakar Sandati 
Sri Prabhakar Anthoti 
Sri SV Kandikatla
Sri Prabhakar K 
Sri Venkata Ramana Murthy Nagisetty
Sri Venkata Sukhakar Rao Pendala
Sri Prakash Rao Otra 
Pranathi 
Sri Ram seshu 
Sri Yadagiri Rao G
Smt Rama Machavolu

రచయితలు/రచయిత్రులకి చిన్న విన్నపము.
ఇక్కడ పొందుపరచిన లిస్ట్ లో ఉన్న కథలు ఆగస్టు 2019 నించీ జులై 2020 సంచిక వరకు ప్రచురించబడతాయి.
వరుసలో కథలు ఉన్నప్పటికీ, ఎక్కువ ఎడిటింగ్ అవసరం లేని కథలు ముందు గానూ, ఎడిటింగ్ అవసరం అయిన కథలు కొంత ఆలస్యం గానూ ప్రచురింపబడతాయి. కథలను ఎడిట్ చెయ్యడానికి తెలుగు తల్లి ఎడిటోరియల్ బోర్డ్ సర్వ హక్కులను కలిగి ఉంటుంది.

విజేతలకు బహుమతులు ఇండియన్ కరెన్సీ లో చెల్లించబడతాయి కాబట్టి, విజేతలు వారి బ్యాంకు వివరాలను telugutalli.competitions19@gmail.com పంపమని మనవి. 
రచయితల రచనలు ఏ సంచికలో ప్రచురింపబడతాయో ఆ నెలలో చెల్లింపులు చేయబడతాయి. 
ఆర్డరు చేసిన బొమ్మలు దిగుమతి అవగానే కొండపల్లి బొమ్మలని సేకరించుకోవలసిన చిరునామా తెలుగుతల్లి ముఖపుస్తకం పేజీలో తెలియచేస్తాము. దూర భారాల్లో ఉన్నవారికి పార్సిల్ సౌకర్యము ఉండగలదని కొండపల్లి బొమ్మల పంపిణీ దారులు తెలియచేసారు. ఇది మా మొదటి ప్రయత్నం కాబట్టి అన్నీ సక్రమంగా జరగాలని కోరుకుంటున్నాము

తెలుగుతల్లి లో ప్రచురించిన తరువాత మాత్రమే వారి కథలని, కవితలని, పిల్లల చిత్రాలని, కార్టూన్ లని ఫేస్ బుక్ లో కానీ ఇంకెక్కడైనా కానీ ప్రచురించాలని వినతి. .
Lion Gurala Vimala Prasad Gangadhar SukhavasiSaroja KomaravoluVijaya Bhaskar Reddy Puduri

Leave a Reply

%d bloggers like this: