సెప్టెంబర్ 22, 2019

ఆమె (చలనచిత్రం) – చిరుస్పందన

Posted in బుల్లితెర-వెండితెర at 8:20 సా. by వసుంధరఇది తమిళచిత్రం. తెలుగులోకి అనువదించబడింది. పోస్టరు చూస్తే ఫక్తు బూతు చిత్రమా అనిపిస్తుంది. కానీ ఇది ఒక చక్కని థ్రిల్లర్.నేటి యువతకు అత్యవసరమైన సందేశాన్నిచ్చే అర్థవంతమైన సినిమా.

నడివీధుల్లో గమ్మత్తు (prank) చేసి – ఆ తమాషాని రికార్డు చేసి – ]టోపీ’ పేరిట ఒక కార్యక్రమంగా ఓ టివి చానెలుకి అందజేసే అబ్బాయిలు, అమ్మాయిల బృందం కథ ఇది. వారి వ్యవహారంతో సరదాగా గడిచిపోతుంది సుమారు 50 నిముషాల చిత్రం. అంతవరకూ చిత్రం బాగానే ఉన్నా, ఎటు వేడుతోంది నేటి యువత అన్న బాధని కలిగిస్తుంది. అక్కడక్కడ కొంచెం అసభ్యంగానూ అనిపిస్తుంది.

ఆ తర్వాత చిత్రంలో కథానాయిక అమలాపాల్ వంటిమీద నూలుపోగు లేకుండా ఓ పెద్ద భవంతిలో ఉంటుంది. వళ్లు కప్పుకుందుకు గుడ్డ మాటటుంచి చిన్న కాగితం కూడా దొరకదక్కడ, ఆమె అక్కణ్ణించి బయటకు రాలేదు. సుమారు గంటకు పైగా ఆమె అక్కడ వివస్త్రగా ఆ భవనంలో తిరగాల్సి ఉంటుంది. ఎవరైనా వస్తే తప్పించుకోవాలి. అక్కడ హత్య జరిగింది. లోపలకు జనాలొచ్చి వెళ్లారు. పోలీసులు వచ్చి వెళ్లారు. ఆ సమయంలో ఆమె లేచి నిలబడాలి. పరుగులు తియ్యాలి. నేలమీద పాకాలి, డాకాలి.

అసభ్యతకు తావివ్వకుండా, అంగ ప్రదర్శన లేకుండా ఈ సన్నివేశాలన్నీ ‘కళాత్మకం’ అనిపించే విధంగానూ, ఉకంఠభరితంగానూ చిత్రీకరించిన ప్రతిభ తెలుగు (బహుశా భారతీయ) చలనచిత్రాల్లో అరుదు.

ఊహించని ముగింపు ఈ చిత్రానికి సామాజికస్పృహని అందించి సందేశాత్మకం చేసి ప్రేక్షకుడికి పూర్తి తృప్తినిస్తుంది.

ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ విడియోలో లభిస్తుంది. ఆన్ లైన్లో ఉచితంగా చూడదల్చినవారు ఈ లంకెలో ప్రయత్నించొచ్చు.Leave a Reply

%d bloggers like this: