Site icon వసుంధర అక్షరజాలం

హౌడీ మోదీ

నాయకత్వం శిక్షణతో కాదు, జన్మతః వస్తుందనడానికి నిదర్శనం మన ప్రధాని మోదీ. ఆయన ఇప్పుడు యావద్భారతానికీ ఆశాజ్యోతి. మాటలకంటే చేతలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే ఆయన సాహసి కూడా. పెద్ద నోట్లు, ట్రిపుల్ తలాక్, ఆర్టికిల్ 370 లను రద్ధు చేసినప్పుడా సాహసాన్ని మెచ్చినవారూ ఉన్నారు, దుస్సాహసమన్నవారూ ఉన్నారు. ఎవరేమన్నా ప్రస్తుతం ఆయనకు దీటొచ్చే నేత దేశంలో లేడు. అది మనకు వరం కావాలంటే, ఆయన చర్యలకు అర్థవంతమైన విశ్లేషణ అవసరం. అవాయనకు మార్గదర్శకాలై మార్గనిదేశనం కూడా చెయ్యొచ్చు.
ఇది మీడియా యుగం. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న యుగం. ఈ సమయానికి తగు మాటలాడే నేర్పున్న వ్యక్తిత్వం తనదని మోదీ పలుమార్లు ఋజువు చేశాడు. మీడియా కారణంగా ఊహించినకంటే ఎక్కువ ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ‘హౌడీ మోదీ’ అమెరికా యాత్ర ఒక గొప్ప ఉదాహరణ. తర్వాత ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆడిన మాటలు – భారత్‍పై అబద్ధపు ఆరోపణలతో, మోదీని వ్యక్తిగతంగా నిందించడమే ధ్యేయంగా అనిపించాయి. తనకొచ్చిన గొప్ప అవకాశాన్ని ‘పిచ్చోడి చేతిలో రాయి’లా ఉపయోగించి సభాసమయాన్ని వ్యర్థం చేశాడు. చిత్రమేమిటంటే – దానికి మోదీపై ప్రయోగించిన అస్త్రం పేరు నిశ్శబ్దం. పాకిస్తాన్ పేరెత్తకుండా, కాశ్మీర్ అనే సమస్య ఒకటి లేనే లేనట్లుగా – ఆయన ప్రపంచపు ప్రగతి గురించి ఎక్కువగా మాట్లాడి ఎంతో ఎత్తుకి ఎదిగాడు. అదాయన సమయస్ఫూర్తికి నిదర్శనం.
అభినందించతగిన ఈ విశేషాల్లోంచి కూడా నేర్చుకోవాల్సిన పాఠాల్ని వెలికి దీసిన – సాగరిక ఘోస్ వ్యాసమొకటి నేటి టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలో వచ్చింది. వీక్షకుల సౌకర్యార్థం లంకెలతో సహా ఇక్కడ అందజేస్తున్నాం.

లంకె 1 లంకె 2

Exit mobile version