Site icon వసుంధర అక్షరజాలం

ప్రపంచ తెలుగు మహాసభలు

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలుకృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో, ప్రపంచ తెలుగు రచయితల సంఘం 2019 డిసెంబర్ 27, 28, 29 తేదీలలో విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాలలో ఈ మహాసభలను నిర్వహోస్తోంది.
ఈమహాసభలలోముఖ్యచర్చనీయాంశాలు:
• తెలుగువారి భాషా సంస్కృతులు, చరిత్ర, మరియు సాంకేతిక ప్రగతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించటం,• వివిధ విశ్వవిద్యాలయాల పరిథిలో నివసిస్తున్న జాతుల భాషల పరిరక్షణ కోసం“మాతృభాషల పీఠాలు” ఏర్పాటు.• తెలుగు మరియు ఇతర మాతృభాషల అభివృద్ధికి పాటుపడేందుకు స్పష్టమైన అధికారాలతో రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు ప్రాధికార సంస్థల నిర్మాణం, వాటి విధి విధానాల రూపకల్పన.• అనేక రాష్ట్రాలలో అధికారభాషగా ఉన్న హిందీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలనే తెలుగుభాష విషయంలోనూ అనుసరింప చేయటం.• రేపటి అవసరాల ప్రాతిపదికగా తెలుగు భాషాబోధన, పాఠ్యాంశాల రూపకల్పన.• ఆధునిక సాంకేతిక రంగంలో తెలుగు వినియోగం, యూనికోడ్, పదకోశాల అభివృద్ధి.• తెలుగు చదివే విద్యార్థులు, బోధించే భాషాపండితుల సమస్యలు, ప్రోత్సాహాకాలు.• వివిధ రాష్ట్రాలలో, దేశాలలో జీవిస్తున్న తెలుగువారి జీవనం, తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకోవటంలో వారు భాషపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు.• తెలుగేతర ప్రాంతాల్లోని తెలుగు వారికి హిందీ ప్రాధమిక, మాధ్యమిక పద్ధతిలో సర్టిఫికెట్ కోర్సుల నిర్వహణ.• నిరాదరణకు గురౌతున్న గ్రంథాలయ వ్యవస్థ మరియు గత ఐదేళ్లుగా ఆగిపోయిన పుస్తకాల కొనుగోళ్లు.• తెలుగు భాషాపీఠాన్ని మైసూరు నుంచి తెలుగు నేలమీదకు తరలింపు.తెలుగు భాష పరంగా లోతైన అధ్యయనం జరిగేందుకు వీలుగా మరిన్ని చర్చనీయాంశాలు సూచించ వలసిందిగా ప్రముఖులను కోరుతున్నాం.2019 జనవరిలో ప్రపంచ తెలుగు రచయితల సంఘం రిజిష్టర్ అయ్యింది. గౌరవాధ్యక్షులుగా డా. మండలి బుద్ధప్రసాద్, గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అధ్యక్షులుగా శ్రీ గుత్తికొండ సుబ్బారావు, ఉపాధ్యక్షులుగా శ్రీ గోళ్ల నారాయణరావు, కార్యదర్శిగా డా. జి వి పూర్ణచందు, సహాయకార్యదర్శిగా డా. గుమ్మా సాంబశివరావు, కోశాధికారిగా శ్రీ టి శోభనాద్రి, కార్యవర్గ సభ్యులుగా డా. ఈమని శివనాగి రెడ్డి, డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, డా. వెన్నా వల్లభరావు, శ్రీ పంతుల వెంకటేశ్వర రావు, శ్రీమతి భమిడిపాటి బాలా త్రిపుర సుందరి, శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గార్లతో ఈ సంస్థ రిజిష్టరు అయ్యింది.రేపటి మహాసభల నాటికి ప్రపంచ వ్యాప్తంగా సభ్యులతో, సంపూర్ణ కార్యవర్గం కలిగిన ఒక అంతర్జాతీయ సంస్థగా రూపు దిద్దుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. తెలుగు భాషాసంస్కృతుల్ని, సాహిత్యాన్ని విశ్వవ్యాపితం చేస్తూ, “ప్రపంచ తెలుగు” కలను నిజం చేయటం తెలుగు భాష, సంస్కృతుల ప్రాచీనతను నిరూపించే చారిత్రక పరిశోధనల్ని ప్రోత్సహించటం, తాజా పరిశోధనలను తెలుగు ప్రజలకు అందించటం, తెలుగుపట్ల జనానురక్తిని పెంపుచేయటం ఈ సంస్థ లక్ష్యాలు.ప్రపంచతెలుగురచయితలసంఘంజీవితసభ్యత్వం:
తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలందరినీ ప్రపంచ తెలుగు రచయితల సంఘంలో జీవిత సభ్యులు కావలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జీవిత సభ్యులు రు. 2000/-(విదేశాలలోని తెలుగు వారికి US 50$) చెల్లించి, ఈ అంతర్జాతీయ వేదిక నిర్మాణంలో సహకరించ ప్రార్థన.మహాసభలప్రతినిథులకుసూచనలు:
4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ప్రతినిధులుగా పాల్గొనే వారు ఈ మహాసభల కోసం రూ.500/- చెల్లించవలసి ఉంటుంది. అయితే, ప్రపంచతెలుగురచయితలసంఘంజీవితసభ్యులుగాచేరినవారుఅదనంగాఈమహాసభలకుప్రతినిథిరుసుముచెల్లించనవసరంలేదు.
ప్రతినిధి రుసుము లేదా జీవిత సభ్యత్వాలను డి.డి. లేదా చెక్కు ద్వారా PRAPANCHA TELUGU RACHAYITALA SANGHAM పేర, విజయవాడలో చెల్లించే విధంగా వ్రాసి, కార్యదర్శి, ప్రపంచ తెలుగు రచయితల సంఘం, 1వ అంతస్థు, సత్నాం టవర్స్, బకింగ్‘హాం పేట పోష్టాఫీసు ఎదురుగా, గవర్నర్ పేట, విజయవాడ-520002 చిరునామాకు పంపాలి.ప్రతినిధులుమరియుజీవితసభ్యులకుమాత్రమేఈమహాసభలప్రాంగణంలోభోజనఉపాహారాలుంటాయివసతిఏర్పాట్లుఎవరికివారేచేసుకోవాలనిమనవిసభా వేదికపైన వీలుని బట్టి రచయితలు తమ రచనలను ఆవిష్కరించుకునే అవకాశం ఎప్పటిలానే కల్పిస్తున్నారు.మహాసభల సమాచారాన్ని మీ సాహితీ మిత్రులకూ తెలుపండి. రచయితలు, భాషాభిమానులు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహాసభలు విజయవంతం కావటానికి సహకరించండి. వ్యక్తిగతంగా ఆహ్వానించాలని కోరుకోకుండా, భాషాభిమానంతో స్వచ్ఛందంగా స్పందించాలని ప్రార్థిస్తున్నాం.ప్రతినిధులుగానమోదుకావటానికిచివరితేదీ 2019 అక్టోబరు 31.
జీవిత సభ్యులుగా నమోదయిన వారికి, అలాగే ప్రతినిధులకు మాత్రమే కవిసమ్మేళనాలు, ప్రసంగాలు, పత్ర సమర్పణలలోనూ ఈ మహాసభల కోసం ప్రత్యేకంగా ‘ప్రపంచతెలుగు’ వ్యాససంపుటిలోనూ ప్రధమ ప్రాధాన్యం ఉంటుంది. మాతో కలిసి నడుస్తూ, మహాసభలు విజయవంతంగా జరగటానికి సహకరించే వారితో మహాసభల ‘నిర్వహణా కార్యవర్గం” ఏర్పాటు చేస్తున్నాము. సానుకూలంగా స్పందించ ప్రార్థన.ప్రపంచ తెలుగు రచయితల సంఘం వివరాల కోసం http://www.prapanchatelugu.comవెబ్‘సైట్ చూడగలరు. మీ సమాచారాన్ని ఇ-మెయిల్: prapanchatelugu@gmail.com కు పంపవచ్చు. శ్రీ గుత్తికొండ సుబ్బారావు,అధ్యక్షుడు 9440167697, డా. జి వి పూర్ణచందు, కార్యదర్శి 9440172642లతో సంప్రదించవచ్చు. పంపినవారుడాజివిపూర్ణచందు,
కార్యదర్శిప్రపంచతెలుగురచయితలసంఘం

Exit mobile version