సాహితీలహరి పార్వతీపురం వారి ఉగాదిపురస్కారాలు ఆహ్వానం.. 2008 సంవత్సరం నుండి ప్రతి యేటా ఉగాది సందర్భంగా మంచి పల్లి సేవా సంస్థ మరియు సాహితీ లహరి పార్వతీపురం వారు శ్రీమతి మంచిపల్లి సత్యవతి స్మారక బాల సాహిత్య పురస్కారాన్నిఒక బాల సాహితీ వేత్త కు ప్రకటించి ఆ రచయిత కు సముచిత రీతిన సత్కరించుట ఆనవాయితీ వస్తున్నది 2018 సంవత్సరం నుండి రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని జాతీయ స్థాయి పురస్కారాంగా ప్రకటించి ఆ సంవత్సరం నకు గాను ప్రముఖ బాల సాహితీ వేత్త శ్రీ దాసరి వెంకటరమణ గారి కి ప్రదానం చేయడం జరిగింది, 2019 సంవత్సరం నకు గాను మరియు 2020 సంవత్సరం నకు గాను ఉగాది సందర్భంగా ఇద్దరు బాలసాహిత్య దిగ్గజాలకు ఈ పురస్కారాల తో సత్కరించదలిచాం ఈ పురస్కారానికి ఎంపిక చేయబడిన బాల సాహిత్య వేత్తలు లకు 6000/-నగదు, జ్ఞాపిక,దుశ్శాలువాతో మరియు బాల సాహితీ భూషణ్ బిరుదు తో సత్కరించదలిచాం, కావున ఆసక్తి ఉన్న బాల సాహితీ వేత్త లు తమ పరిచయం (బయోడేటా)లను మరియు మీ ముద్రించిన రచనల రెండు కాపీలతో 20 ఫిబ్రవరి 2020తేది లో గా సాహితీ లహరి వ్యవస్థాపకులు డా:మంచి పల్లి శ్రీరాములు, శ్రీ సత్య హిందీ భవన్,బెలగాం పార్వతీపురం 535501, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామా కు పంపించవలసింది గా కోరుతున్నాం మరిన్ని వివరాలకు యమ్.శ్రీరాములు 9440106714 మరియు మంచిపల్లి పార్థసారధి 9440367532, సెల్ ఫోన్లు లో సంప్రదించ వచ్చను, ఈ పురస్కారాల ఎంపిక కమిటీ సభ్యులు సూచన మేరకు విజేతలను ఎంపిక చేసి విజేతలకు సమాచారం తెలియ చేయగలం