Site icon వసుంధర అక్షరజాలం

అజోవిభో

ప్రత్యేక సమాచారం

అజో-విభో-కందాళం ఫౌండేషన్ గత 27 సం.లుగా తెలుగు రాష్ట్రాలలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సామాజిక రంగాలలో విశేష కృషి చేసిన తెలుగు ప్రముఖులను సత్కరిస్తూ, తెలుగు నాటక రంగ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా నాటక పరిషత్ ను నిర్వహిస్తున్నది.

  1. జనవరిలో వార్షికోత్సవాలో భాగంగ మొదటి గురువారం నుండి నాలుగు రోజుల పాటు జరిగే పరిషత్తు తెలుగు నాటక పరిషత్తుల ముఖద్వారంగా ప్రశంసించబడుతున్నది. ఫౌండేషన్ అందజేసే జీవిత కాల సాధన పురస్కారం తెలుగు వారి జ్ఞానపీఠ పురస్కారమని పలువురు ప్రముఖులు ఆ సభలలోనే అభిప్రాయపడ్డారు.
  2. ప్రతి నెలా – “నెల నెల వెన్నెల” అనే శీర్షికన చీరాలలొ పౌర్ణమి నాడు జరిగే సంగీత సాహిత్య సాంస్కృతిక కార్యక్రమం ఇప్పటికి 135 నెలలుగా నిరంతరాయంగా కొనసాగుతున్నది. తెలుగు రాష్ట్రాలలోని అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
  3. ప్రతి నెలా అమావాస్య నాడు – “నెల నెలా నందివర్ధనం” శీర్షికన చీరాలకు దగ్గర్లోని వెదుళ్ళపల్లిలో జరిగే సాహిత్య కార్యక్రమంలో ప్రసిద్ద సాహితీవేత్తలు పాల్గొని ఉపన్యసిస్తారు. ఇప్పటి 65 నెలలుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. గంట పాటు జరిగే ఈ ఉపన్యాసాన్ని రికార్డ్ చేసి తదుపరి ముద్రించడం జరుగుతున్నది. మొదటి 25 ఉపన్యాసాలు ప్రాచీన పద్యసాహిత్యంపై జరుగగా “ప్రాచీన సాహిత్యంలో మేరు శిఖరాలు – నన్నయ నుండి కంకంటి దాకా” అనే శీర్షికతోనూ – రెండవ 25 ప్రసంగాలను “ఆధునిక పద్య సాహిత్యంలో మేరు శిఖరాలు – తిరుపతి వేంకట కవుల నుండి” అనే శీర్షికతో ముద్రించగా రెండు గ్రంథాలు రెండవ ముద్రణ జరిగింది. ప్రస్తుతం సినీ గేయ సాహిత్యం పై వుపన్యాసాలు కొనసాగుతున్నాయి.
  4. “రంగభూమి” పేరుతో ప్రతి నెలా వొకటవ మరియు మూడవ ఆదివారాలలో గుంటూరులో జరిగే కార్యక్రమంలో తెలుగు నాటక రచయితలపై ఉపన్యాస కార్యక్రమం జరుగుతున్నది ఇప్పటికి 23 ఉపన్యాసాలు ప్రఖ్యాత నాటక రచయితల కృషిపై జరిగాయి ఈ ఉపన్యాసాలు గ్రంథ రూపంలోనికి తీసుకు రావడం జరుగుతుంది.
  5. భద్రపర్చుకోదగ్గ సాహిత్యాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్న ఆశయంతో అనేక గ్రంథాలను ముద్రించే కార్యక్రమం కొనసాగుతున్నది.
Exit mobile version