ఫిబ్రవరి 6, 2020
పోటీలు – ప్రతిలిపి
ప్రతిలిపిలోని కవుల కవిత్వాన్ని ఎక్కువ మంది పాఠకులకు చేరువ చేయాలనే సదుద్దేశంతో ప్రతిలిపి కవి-కవిత్వం శీర్షికను నిర్వహిస్తున్నాము.
కవిత్వం రాయడమే కాదు రాసిన కవిత్వాన్ని ఎలా చదవాలో రాసిన కవికి మాత్రమే తెలుస్తుంది. కవితను రాసిన వారే స్వయంగా వారి కవిత్వాన్ని చదివి వినిపిస్తే మరింత బాగుంటుంది.
ప్రతిలిపిలోని మీ కవితలను మీరు చదువుతూ వీడియో తీసుకొని మాకు పంపినట్లు అయితే ప్రతిలిపి యౌట్యుబ్ ఛానల్ లో ఆ వీడియోలను అప్లోడ్ చేస్తాము. అంతే కాకుండా ఉత్తమమైన కవితలకు నగదు బహుమతులు కూడా అందజేస్తాము.
బహుమతులు :
మొదటి బహుమతి : 1000
నాలుగు రెండవ బహుమతులు : 500
ముఖ్యమైన తేదీలు :
1.చివరి తేది : 15.03.2020
2.16.03.2020 న ఫలితాలు ప్రకటించే తేదిని చెప్పబడును.
నియమాలు :
మీ వీడియోస్ HD MP4 ఫార్మాట్ లో మాత్రమే ఉండాలి. వీడియోలో ఎలాంటి రీసౌండ్స్ ఉండకూడదు. వీడియో బ్యాక్ గ్రౌండ్ లో ఒక తెర ఉండేలా చూసుకోండి. మీ వీడియో చిన్నదిగా ఉండేలా చూసుకోండి. (ఉదాహరణకు ఐదు నిమిషాల వ్యవధి కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి)
సుదీర్ఘమైన కవితలు స్వీకరించబడవు. వచన కవిత్వం మాత్రమే స్వీకరించబడును. గేయాలు లేదా ఇతర కవిత్వ ప్రక్రియలు పోటీకి పంపకూడదు.
వీడియోలో కేవలం మీ పేరు చెప్పి ఆ తర్వాత కవితా శీర్షిక చెప్పి కవితను చదవాల్సి ఉంటుంది. మీ సొంత కవితలు, అవి కూడా ప్రతిలిపిలో మీరు ప్రచురించిన కవితలను మాత్రమే చదవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒక కవిత మాత్రమే పంపాలి.
బహుమతుల ప్రకటన :
మా ప్రతిలిపి న్యాయనిర్ణేతల టీం మీ వీడియోస్ చూసి ఫలితాలను ప్రకటించబడును. కవిత యొక్క వస్తువు ఎంపిక, చదివిన విధానం, వీడియో క్వాలిటీ, వీడియో సమయం ఇలా అనేక విషయాలను పరిగణలోకి తీసుకొని విజేతలను ప్రకటించబడును.
మీ వీడియోలను పంపే విధానం :
మీ పూర్తి పేరు, ఫోన్ నెంబర్, కవిత దేని గురించో ఒక వాక్యంలో రాసి మాకు telugu@pratilipi.com కి మెయిల్ చేయండి.
ముఖ్య గమనిక : సమాచారాన్ని మీకు తెలియ పరచడానికి ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. మీ వీడియోస్ మాకు మెయిల్ చేయండి.
ప్రతిలిపి తెలుగు విభాగం
జాని తక్కెడశిల (అఖిలాశ)
Leave a Reply