ఫిబ్రవరి 7, 2020

విశాలాక్షి – పత్రిక పరిచయం, విన్నపం, కథల పోటీలు

Posted in కథల పోటీలు, మన పత్రికలు, సాహితీ సమాచారం at 4:24 సా. by వసుంధర

విశాలాక్షి ఒక మంచి పత్రిక. కథలు, కవితలకు పోటీలు నిర్వహించి – నాణ్యమైన కథల్ని ఎంపిక చేసి ప్రచురిస్తున్న విలువైన పత్రిక. విలువలే ప్రాధాన్యంగా సాహితీ సేవ చేస్తున్న ఈ పత్రికను ఇక్కడ పరిచయం చేస్తూ, మనుగడకై ఆ పత్రిక చేస్తున్న విన్నపాన్ని పొందుపరుస్తున్నాం. పత్రిక కొత్తగా నిర్వహిస్తున్న పోటీల గురించిన వివరాలు అక్షరజాలం గతంలో ప్రకటించి ఉన్నా – మరోసారి ఇక్కడ పొందుపరుస్తున్నాం.

మా సౌలభ్యం కోసం అన్నీ ఒకచోట ఇస్తున్నా – పత్రికవైపునుంచి పోటీలకూ, పత్రిక విన్నపానికీ ముడి లేదని మనవి.

పోటీల స్థాయి తెలుసుకోవాలంటే – గత సంవత్సరం పోటీ కథలు చదివి తీరాలి. ఆ సంచికల్ని పత్రికకు వ్రాసి తెప్పించుకుంటే, చదివి దాచుకోవాల్సిన కథలవి. ఆ కథలపై వసుంధర విశ్లేషణ త్వరలో వేరే పత్రికలో రానున్నది.

Leave a Reply

%d bloggers like this: