ఫిబ్రవరి 25, 2020

తెలుగులో ఓ గొప్ప సినిమా c/o కంచరపాలెం

Posted in వెండి తెర ముచ్చట్లు at 7:31 సా. by వసుంధర

.

నటీనటులు కొత్తవారు. వారికి మేకప్ లేదు

సినిమాకి సెట్టింగు లేదు. ఓ మామూలు పల్లెటూరే సెటింగు.

కథలో మసాలాలు లేవు. కథనంలోనూ మసాలా లేదు.

శృంగారానికి ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా – అతి సామాన్యమైన ప్రేమ జంటలు ఒకటి కాదు, రెండు కాదు – మొత్తం నాలుగు. అన్ని ప్రేమల్లోనూ తియ్యని బాధ ఉంది. అందని లోతులున్నాయి. వాటి ముగింపే సినిమాకీ ముగింపు. ఆ ముగింపు ఊహకందడం కష్టం. కానీ హిచ్‍కాక్ సినిమాకంటే ఎక్కువగా థ్రిల్ చేస్తుంది. ఆ తర్వాత ఆ ముగింపుకి సంబంధించిన పరవశం ప్రేక్షకుణ్ణి వెన్నాడుతుంది.

తెలుగులో ఇలా సినిమాలు తీసేవాళ్లున్నారా అన్నంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, సహజత్వంలో సత్యజిత్ రే వంటి బెంగాలీ బాబుల్ని కూడా నివ్వెరపరిచే ఈ చిత్రం – గత శతాబ్దపు శంకరాభరణంలా ఈ శతాబ్దానికో మైలురాయి.

ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ సదుపాయమున్నవారికి టివిలో సులభంగా అందుబాటులోకొస్తుంది. మిగతావారు అంతర్జాలంలో ప్రయత్నించుకోవాలి.

చలన చిత్రాల్ని అభిమానించేవారు తప్పక చూడాలి. మంచి చిత్రాలకోసం తపించేవారు ఈ చిత్రాన్ని చూడకపోతే అది వారికో పెద్ద లోటు.

ఈ చిత్రం చూసినప్పుడు మాకు కలిగిన స్పందనని పంచుకోవడమే ఈ టపా ఉద్దేశ్యం.

ఇతర వివరాలు వికీలో లభిస్తాయి. లంకెః https://en.wikipedia.org/wiki/C/o_Kancharapalem

1 వ్యాఖ్య »

  1. newsgita said,

    మంచి ప్రయత్నానికి మంచి ప్రచారం మీ పోస్టు


Leave a Reply

%d bloggers like this: