ఫిబ్రవరి 29, 2020
లైవ్ సీరియల్ చాలెంజ్ – ప్రతిలిపి

అందరికి నమస్కారం,
ప్రతిలిపి అతిపెద్ద లైవ్ సీరియల్ పోటీతో మీ ముందుకు వచ్చింది. అరవై రోజుల్లో లైవ్ సీరియల్ రాయండి 50,000 వేల రూపాయలు నగదు బహుమతులు పొందండి. ఈ పోటీలో ఎవరైనా పాల్గొన వచ్చు. లైవ్ సీరియల్ ఏ అంశంపై అయిన రాయవచ్చు. అయితే సైన్స్-ఫిక్షన్, హిస్టారికల్, ఫాంటసీ ఇంకా ఏదైనా కొత్త వర్గానికి సంబంధించిన ధారావాహికకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
బహుమతులు :
మొదటి బహుమతి : 25000
రెండవ బహుమతి :15,000
మూడవ బహుమతి : 10,000
పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రం ఇంటికి పంపబడును.
పోటీలో ఎవరు పాల్గొన వచ్చు?
పోటీలో ఎవరైనా పాల్గొన వచ్చు.
నేను ఎప్పుడు ధారావాహిక రాయలేదు. నేను కూడా పాల్గొన వచ్చా?
తప్పకుండా పాల్గొన వచ్చు. మీకు ఎలా రాయాలో సందేహాలు ఉంటే మా ప్రతిలిపి బృందం మీకు సహాయం అందిస్తుంది.
లైవ్ సీరియల్ అంటే ఏమిటి?
ప్రతిలిపిలో ధారావాహికను ప్రచురణ చేస్తున్నప్పుడు లైవ్ సీరియల్ ఆప్షన్ ఎంచుకోవాలి. అలాగే సీరియల్ ప్రతి రోజూ పోస్ట్ చేస్తారో, వారానికి ఒకసారి పోస్ట్ చేస్తారో, రెండు సార్లు పోస్ట్ చేస్తారో ముందే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న ప్రకారం ప్రచురణ చేయడమే లైవ్ సీరియల్.
పూర్తిగా లైవ్ సీరియల్ గురించి తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ధారావాహిక ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి?
15.04.2020 లోపు మీ ధారావాహిక పూర్తి చేయాలి.
పోటీలో ఎన్ని ధారావాహికాలైనా రాయవచ్చా?
అవును. ఈ పోటీలో ఒక రచయిత ఎన్ని ధారావాహికాలైనా రాయవచ్చు. కాకపోతే ఇచ్చిన గడువు లోపు పూర్తి చేయాలి.
ధారావాహిక భాగాలు ఎన్ని ఉండాలి?
ధారావాహిక కనీసం ఐదు భాగాలు ఉండాలి. అన్ని భాగాలు కలిపి మీ ధారావాహిక తప్పనిసరిగా 7000పదాలు ఉండాలి. 7000 దాటి ఎన్ని పదాలు రాసిన అతి మీకు ప్లస్ అవుతుంది.
ఈ పోటీలో పాల్గొనే వారు ధారావాహికను ప్రచురణ చేస్తున్నప్పుడు ఏ వర్గం సెలెక్ట్ చేసుకోవాలి?
ఈ పోటీకి ధారావాహికను సబ్మిట్ చేసేవారు ‘లైవ్ సీరియల్’ అనే వర్గాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మొదటి భాగాన్ని ప్రచురణ చేసి ఆ ధారావాహిక భాగాన్ని మా వాట్సప్ నెంబర్ 7259511956 కి పంపాలి. అప్పుడే ఆ ధారావాహిక పోటీలో ఉన్నట్టు అర్థం.
విజేతల ఎంపిక ఎలా ఉంటుంది?
సుప్రసిద్ధ రచయితలు, విమర్శకుల బృందం మీరు ఎంచుకున్న వస్తువు, కథనం, శిల్పం, చక్కని వ్యాకరణం లాంటివి అనేకం పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తారు. పెద్ద ధారావాహికలు రాస్తే ఎక్కువ హెల్ప్ అవుతుంది. అక్షర దోషాలు ఉండకూడదు. ధారావాహికలో ఆంగ్ల పదాలు ఉండరాదు.
కాపీ రైట్ :
ప్రతిలిపిలో ఇది వరకు ప్రచురణ అయినవి పోటీలో పెట్టరాదు. వేరే పత్రికల్లో రాసినవి సబ్మిట్ చేయవచ్చు. కాపీ చేసిన రచనలు పోటీకి పంపితే చట్టపరమైన చిక్కులు ఉంటాయి.
Leave a Reply