మార్చి 10, 2020

బాల రచయితల సమ్మేళనం

Posted in సాహితీ సమాచారం at 5:46 సా. by వసుంధర

ఇది చారిత్రాత్మకంగా జరుగుతున్న కార్యక్రమం.. బాలసాహిత్యం అంటే పెద్దలు పిల్లల కోసం రాసేవారు ఇదివరకు..
కానీ నేడు ట్రెండ్ మారింది.బాల బాలికలు తమ కోసమే తాము రాసుకుంటున్నారు…ఏమి చూశారో..ఏమి విన్నారో ఆ సంఘటనల్నే కథలుగా మలస్తున్నారు. ఏమి కావాలనుకుంటున్నారో అవి రాసి ఆశ్చర్యం కల్గిస్తున్నారు. పెద్దలు అవురా అనేలా చక్కని బాలసాహిత్యాన్ని సృజనాత్మకంగా సృజిస్తున్నారు.”బాలచెలిమి” “చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడెమీ” మరియు తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా 600 మంది బాల రచయితలచే సమ్మేళనం నిర్వహించబోతున్నామని “బాలచెలిమి “సంపాదకులు మణికొండ వేదకుమార్ గారు, బాల సాహిత్యవేత్త గరిమెళ్ళ అశోక్ గారు,నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, బాలసాహిత్యవేత్త డా” పత్తిపాక మోహన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

%d bloggers like this: