Site icon వసుంధర అక్షరజాలం

శ్రీమతి మంచిపల్లి సత్యవతి స్మారక జాతీయ స్థాయి బాల సాహిత్య ఉగాది పురస్కారం

డి.కె.చదువులబాబుమరియు డా.పత్తిపాక మోహన్ లకు శ్రీమతి మంచిపల్లి సత్యవతి స్మారక జాతీయ స్థాయి బాల సాహిత్య ఉగాది పురస్కారం సాహితీ లహరి పార్వతీపురం మరియు మంచిపల్లి సేవా సంస్థ వారు ప్రతీ సంవత్సరం శ్రీమతి మంచిపల్లి సత్యవతి స్మారక జాతీయ స్థాయి బాల సాహిత్య ఉగాది పురస్కారం ప్రదానం చేయడం జరిగుతున్నది ఈ సంవత్సరం ఇద్దరు బాలసాహిత్య లో దిగ్గజాలకు ఈ బాల సాహిత్య పురస్కారాలను ఆ సంస్థ వ్యవస్థాపకులు డా: శ్రీ మంచిపల్లి శ్రీరాములు ప్రకటించారు, 2019 సంవత్సరం గాను డి.కె.చదువులబాబు బాల సాహిత్య వేత్త కడప గారికి మరియు 2020 సంవత్సరం గాను డాక్టర్ శ్రీ పత్తిపాక మోహన్ బాల సాహిత్యవేత్త హైదరాబాద్ వారి కి ప్రదానం చేయనున్నాటు తెలియజేశారు ఈ పురస్కారాలకు గాను 6000/-నగదు,జ్ఞాపిక దుశ్శాలువాతో మరియు బాల సాహితీ భూషణ్ బిరుదు తో పాటు ప్రమాణపత్రం తో సత్కరించదలిచాం వీరికి పార్వతీపురం లో జరుగు సభ లో విశిష్ట వ్యక్తుల చేతులమీదుగా అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది అని మంచిపల్లి సేవా సంస్థ డైరెక్టర్ శ్రీ యమ్.పార్థ సారధి మరియు గోపీనాథ్ లు ఒక ప్రకటన లో విడుదల చేశారు

Exit mobile version