ఏప్రిల్ 1, 2020
కరోనా కవితల పోటీ – రామోజీ ఫౌండేషన్
‘కరోనా’ నేపథ్యంలో ‘తెలుగువెలుగు’ నిర్వహణలో ఈనాడు, ఈటీవీ-భారత్, ఈనాడు.నెట్, ఈ.ఎఫ్.ఎం.ల సంయుక్త ఆధ్వర్యంలో నెల రోజుల పాటు రోజూ కవితల పోటీ ఉంటుంది.* ఏప్రిల్ 1వ నుంచి రోజూ కవితల స్వీకరణ ప్రారంభం అవుతుంది.
- రోజూ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు. కొన్ని సాధారణ ప్రచురణలు.
- ప్రథమ రూ.1,000; ద్వితీయ రూ.750; తృతీయ రూ.500, సాధారణ ప్రచురణకు రూ.250.
- ప్రథమ బహుమతి కవితలు ఈనాడు ప్రధాన పత్రికలో ప్రచురితం అవుతాయి.
- బహుమతి కవితలన్నీ తెలుగువెలుగు.ఇన్లో వెలువడతాయి.
నియమ నిబంధనలు
- వచన లేదా గేయ కవిత… ఈ రెండింటిలో ఏ ప్రక్రియలో అయినా రాయవచ్చు.
- రచన 40 పంక్తులకు మించకూడదు.
- ఏ మాండలికంలో అయినా రాయవచ్చు.
- సాధ్యమైనంతగా తెలుగులోనే రాయాలి. మరీ అనివార్యం అయితే తప్ప ఆంగ్ల పదాలు వాడకూడదు.
- కవితలను తెలుగువెలుగు సైటులో ‘కరోనా కవితల పోటీ’ విభాగంలో నేరుగా రాయాలి. మెయిల్స్, వాట్సప్ వంటి వాటి ద్వారా పంపేవి పరిశీలించడం వీలుకాదు.
- రోజు వారీ పోటీ ఎలా అంటే… ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 9 గంటల వరకూ వచ్చిన వాటిని ఆ రోజు పోటీకి పరిగణనలోకి తీసుకుంటాము. వాటి పరిశీలన 2వ తేదీన జరుగుతుంది. ఫలితాలు 3వ తేదీన ఈనాడు ప్రధాన పత్రికలో వెలువడతాయి. 2వ తేదీ 9 గంటల తరువాత వచ్చినవి ఆ రోజు పోటీకి పరిశీలనలో ఉంటాయి. కాబట్టి కవులు నిరుత్సాహ పడవలసిన అవసరం లేదు. కాకపోతే ఒకసారి ఎంపిక కానివి తిరస్కరించినట్టే. వాటిని మళ్లీ పోటీకి పంపకూడదు.
- రోజూ 1, 2, 3 బహుమతులు తప్పనిసరి కాదు. ఆ స్థాయివి లేకపోతే ఆ బహుమతి ఉండదు. తగిన స్థాయి కవితలు రాని రోజున బహుమతులు ఉండవు.
- రోజుకు ఒకరు ఒక కవితను మాత్రమే పంపాలి.
- కరోనాకు సంబంధం లేని అంశాల మీద కవితలను ఈ పోటీకి పంపకూడదు.
రచనలు… - ప్రజల్లో చైతన్యాన్నీ, ఆశను, ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆలోచనను, సానుకూల భావాలను పెంచాలి.
- ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెట్టి మరీ రేయింబవళ్లూ కృషిచేస్తున్న వైద్యులు, పోలీసులు తదితర రంగాల సిబ్బందిని ప్రోత్సహించేలా, వారిలో నైతిక స్థైర్యాన్ని కలిగించేలా ఉండాలి.
- ఏ వర్గాన్నీ కించపరిచేలా ఉండకూడదు.
- భయాన్ని, నిర్వేదాన్ని, ప్రతికూల భావాలను కలిగించే కవితలను స్వీకరించము.
- ఈ పోటీకి పంపే రచన ఇప్పటి వరకూ ఏ పత్రికలో, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచురితం కాలేదని, పరిశీలనలో లేదని హామీ ఇవ్వాలి.
- రామోజీ గ్రూపు సిబ్బంది ఈ పోటీలో పాల్గొనకూడదు.
- రచనల ఎంపిక విషయంలో రామోజీ ఫౌండేషన్ సంపాదకవర్గానిదే తుది నిర్ణయం. ఈ విషయంలో విచారణలకు, వాదప్రతివాదాలకూ తావు లేదు.
- పోటీని మధ్యలో నిలిపివేసే, లేదా పొడిగించే అధికారం రామోజీ ఫౌండేషన్దే.
- బహుమతి మొత్తాల్ని పోటీలు పూర్తయ్యాక నేరుగా విజేతల ఖాతాల్లో జమ చేస్తాము.

Leave a Reply