ఏప్రిల్ 13, 2020

స్వేచ్ఛకు దర్పణం రాహత్ కవిత

Posted in కవితాజాలం, సాంఘికం-రాజకీయాలు, సాహితీ సమాచారం at 11:02 ఉద. by వసుంధర

మన దేశంలో సృజనాత్మక గళానికి స్వేచ్ఛ లేదని ఘోషించేవారు మేధావులుగా చెలామణీ అవుతున్నారు. మంది చదివే పత్రికల్లో ‘శాంతిపై దిల్లీలో మనమే మాట్లాడుతున్నాం, మిత్రులారా మీరైనా లాహోర్ తో మాట్లాడండి’ అనగల కవులకు లభించే ప్రశంసలు స్వేచ్ఛకు దర్పణమని స్పష్టం కాదా! ‘సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలున్నాయా అడిగి చూడు ఎన్నికలు జరగబోతున్నాయా’ అని ఏక పక్ష వ్యంగ్యాస్త్రాలు విసిరినా ‘నేను నా శవాన్ని భుజాలకెత్తుకుని తిరుగుతున్నా, ఇక్కడ భూమి రేటు చాలా చాలా ఎక్కువ’ అనగల అద్భుత స్పందనని ఆస్వాదించకుండా ఉండగలమా?

ఈ దేశంలో పౌరులకు దేవుడిచ్చిన గొప్ప వరం స్వేచ్ఛ. వరాల్ని సదుపయోగం చేసుకునేవారు మహాత్ములు. దురుపయోగం చేసుకునేవారు రాక్షసులు. ఆ ఫలితాల్ని అనుభవించేవారు మాత్రం సామాన్యులు.

శివభక్తితో విష్ణువుని ద్వేషించిన వరగర్వితుడు రావణుడు కూడా పూర్ణాయువుతో మనుమల్ని కూడా కళ్లజూసుకుని రాజ్యమేలాడు. వరాలు మేలు చేసినా, కీడు చేసినా సామాన్యులకే తప్ప వరలబ్దిదార్లకు కాదు.

కవుల సృజనా ప్రతిభకు స్వేచ్ఛ సదుపయోగమై భాసిల్లగలదనీ, నిరసన భావం ఉగ్రవాదం పట్ల కూడా మహోగ్రం కాగలదనీ ఆశిస్తూ- ఈ పరిచయ వ్యాసంలో ఉటంకించబడిన కవి హృదయానికి జోహారులర్పిస్తున్నాం.

Leave a Reply

%d bloggers like this: