ఏప్రిల్ 21, 2020

కథల పోటీలు – ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 5:28 సా. by వసుంధర

ప్రతిలిపి జాతీయ కథల పోటీ “కథా మహోత్సవం-2020” శీర్షికతో మీ ముందుకు వచ్చింది. ఈ పోటీలో ఎన్ని కథలైన, ఏ వర్గానికి చెందిన కథలైన కేవలం రచయితలే మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు.

బహుమతులు :

మొదటి బహుమతి : 10,000

రెండవ బహుమతి : 5000

మూడవ బహుమతి : 3000

న్యాయనిర్ణేత అందించే ఫలితాలు ఆధారంగా:-

మీ కథలను మా న్యాయనిర్ణేతలు చదివి మీరు ఎలాంటి కథాంశం తీసుకున్నారు, కథలోని శిల్పం, తదితర అంశాలు పరిగణలోకి తీసుకొని విజేతలను ప్రకటించడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు :

1.చివరి తేది: మే.27.2020.

2.మీ కథలను 29.మే.2020న మేము పరిశీలించి ప్రచురణ చేస్తాము. అదే రోజు ఫలితాలు ప్రకటించే తేదీని తెలియజేస్తాము. సబ్‌మిట్ చేసిన రచనలు మీ ప్రొఫైల్ లో, సంబంధించిన వర్గాలలో మరియు ఈవెంట్ పేజిలో కనపడతాయి.

నియమాలు :-

1.ప్రతి రచయిత ఎన్ని కథలైన సబ్‌మిట్ చేయవచ్చు. కథలు పూర్తిగా మీ సొంతమై ఉండాలి.
2.పూర్వం ప్రతిలిపిలో ప్రచురింపబడిన మీ కథలు పోటీకి సబ్‌మిట్ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణమైనవి సబ్‌మిట్ చేయవచ్చు.
3.సాధ్యమైనంత వరకు అక్షర దోషాలు లేకుండా చూసుకోండి.

పోటీలో పాల్గొనే పద్ధతి :-

పోటీలో పాల్గొనడానికి క్రింది “పాల్గొనండి” బటన్ పై క్లిక్ చేసి ఇక్కడ వ్రాయండి అనే చోట కథను రాసి అప్‌లోడ్ బటన్ పై క్లిక్ చేసి, కథ యొక్క శీర్షికను జతచేసి తరువాత అనే బటన్ పై క్లిక్ చేసి కథకు తగిన ఫోటో అప్‌లోడ్ చేసి మళ్ళీ తర్వాత అనే బటన్ పై క్లిక్ చేయండి. కథ యొక్క వర్గాన్ని సెలెక్ట్ చేసుకొని కాపి రైట్స్ అంగీకరిస్తూ టిక్ మార్క్ ఇచ్చి కథను సబ్‌మిట్ చేయండి.

అలాగే మీ రెండవ కథ, మూడవ కథ, నాలుగవ కథ, ఐదవ కథ కూడా సబ్‌మిట్ చేయగలరు. ఐదు కథలు తప్పనిసరి కాదు. ఐదు కథల లోపు ఎన్ని కథలైన సబ్‌మిట్ చేయవచ్చు. మీరు సబ్‌మిట్ చేసిన కథలు మీ సమర్పణలు అనే శీర్షిక కింద ఉంటాయి. ఆ కథలను మాత్రమే మేము పోటీకి పరిగణిస్తాము. డ్రాఫ్ట్ లో ఉన్న కథలు పోటీలో ఉన్నట్లు కాదు. కావున గడువు లోపు మీ డ్రాఫ్ట్ లో ఉన్న కథలను సబ్‌మిట్ చేయాలి.

సందేహాలకు : మెయిల్ – telugu@pratilipi.com

https://telugu.pratilipi.com/event/im0ra25uzi

Leave a Reply

%d bloggers like this: