మే 24, 2020

కరోనా లాంటి ఓ ‘చూపుడువేలు’

Posted in కథాజాలం, సాంఘికం-రాజకీయాలు, సాహితీ సమాచారం at 11:45 ఉద. by వసుంధర

మే 17న ఆదివారం ఆంధ్రజ్యోతిలో అఫ్సర్ గారి ‘చూపుడు వేలు‘ – (కథని కింద అందించాం) ప్రపంచమంతా ఏకమై ఎదుర్కొంటున్న ఓ మహమ్మారి సమస్యకి మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తూ – మిగతా వేళ్లని పట్టించుకోలేదు. అందువల్ల ఆయన మనసొక వూహాన్‍గా మారి మరో కరోనాకి జన్మనిచ్చేందుకు దోహదం చేస్తోంది. ఆ కరోనా సోకకుండా, పాకకుండా తీసుకోవాల్సిన అత్యవసరమైన జాగ్రత్తల్ని అందించడానికి కస్తూరి మురళీకృష్ణ గారు చూపుడు వేలు కాక మిగతా వేళ్లని ఉపయోగించిన తీరు ప్రశంసనీయం. ప్రమాదకరమైన మానసిక రోగుల్నించి ఆవిర్భవించే కరోనాల్ని నిస్తేజం చెయ్యడానికి ఇలాంటి కథలే వాక్సిన్లు. కస్తూరి వారికి అభినందనలు.

నిజానికి అఫ్సర్ గారి కథలో కూడా మిగతా నాలుగు వేళ్లూ ఉన్నాయి. అవి రజియా పాత్రవి. చూపుడువేలుకి ప్రాధాన్యమివ్వడానికి అలవాటుపడ్డ ప్రముఖులలాగే వారూ ఆ నాలుగువేళ్లనూ పట్టించుకోతగ్గవిగా భావించలేదు.

ఇదే కథపై అమెరికా వాస్తవ్యులు, ప్రముఖ రచయిత తాడికొండ శివకుమారశర్మ గారు స్పందించిన తీరు ప్రతిభావంతం. విమర్శకులకు, సాహితీప్రియులకు, సమాజహితైభిలాషులకు ఎంతో ప్రయోజనాత్మకం.

Leave a Reply

%d bloggers like this: