మే 27, 2020
కథా పరిచయంః రెండు ప్రపంచాలు
శ్రీమతి నాదెళ్ల అనూరాధ వ్రాసిన ‘రెండు ప్రపంచాలు’ అనే కథ ఈ మాట అనే వెబ్ పత్రిక మే 2020 సంచికలో వచ్చింది. కథకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మార్గదర్శకానికి వర్ధమాన రచయితలూ, మనోల్లాసానికీ, వికాసానికీ సాహితీ ప్రియులందరూ చదవాల్సిన ఈ కథ గురించి మా అభిప్రాయాన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాం.
ఇది దినచర్యలో వాస్తవ సన్నివేశాలతో నిండిన స్కెచ్ లాంటి కథ. పరిస్థితుల్ని యథాతథంగా ప్రదర్శిస్తూనే ఆలోచింపజేసే కథ. ఎవర్నీ విమర్శించకుండానే సంస్కారం దిశలో స్పష్టమైన సందేశాన్ని అంతర్లీనం చేసుకున్న కథ. కథాంశానికి అవసరమైన హంగులన్నీ కూర్చి, పొల్లు అనిపించే వాక్యం మచ్చుకి ఒక్కటైనా కనిపించనివ్వని సమగ్రమైన కథ. ఆటోలో బడిపిల్లల్ని ఆహ్లాదంగా, స్వీటుషాపులో సేల్సుగర్ల్స్ని ఆత్మవిశ్వాసపరంగా గమనించిన కథ. కాఫీ డే వాతావరణాన్ని ప్రస్తావించినప్పుడు కాఫీ డే యజమానికి సంబంధించిన విశేషాన్ని కూడా స్ఫురణకు తెచ్చుకోగల స్పృహ ఉన్న కథ. ఈ కథాంశానికి అనితర సాధ్యం అనిపిస్తూనే మార్గదర్శకమైన గొప్ప ముగింపునిచ్చిన కథ. చదవగానే అద్భుతం అనిపించే ఈ కథను వ్రాసిన, ప్రచురించిన వారికి అభినందనలు.
Leave a Reply