జూన్ 3, 2020

కరోనా లాంటి ఓ ‘చూపుడు వేలు’

Posted in రచనాజాలం, సాంఘికం-రాజకీయాలు, సాహితీ సమాచారం at 5:25 సా. by వసుంధర

ఈ శీర్షికతో అక్షరజాలం అందించిన విశేషాలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఈ సందర్భంగా ఈ విషయమై ‘సారంగ’ లో కలిగిన స్పందనలు, ప్రతిస్పందనల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

వీటిపై వసుంధర స్పందన ఇదిః

బాధ్యతని పక్కన పెట్టి వివక్షమీద దృష్టి సారించాల్సిన సమయం కాదిది. ఆలోచనలు పక్కదారి పడితే కరోనా మొత్తం మానవజాతినే కబళించగల మహమ్మారి. మైనారిటీల పట్ల వివక్ష విషయంలో – మన పొరుగు దేశాలకూ, మనకూ ఉన్న పోలికలు, తేడాలు మనసునించి కాక వాస్తవాలనుంచి పుడితే బాగుంటుంది. కానీ వాస్తవాలు కూడా మనసులోంచే పుడితే ఎవరూ చెయ్యగలిగింది లేదు. ఇటీవల చేతన్ భగత్ విరచిత వ్యాసానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఇది కేవలం వివక్ష పట్ల అవగాహనకు మాత్రమే. వివక్ష పట్ల ఏకపక్షంగా ఆలోచించాలని fix ఐపోయినవారు తమ భావాల్ని స్మర్ధించే ఇలాంటి మరో వ్యాసాన్ని ఆశ్రయించవచ్చునని తెలుసు. ఐనా అన్ని రంగాల్లోనూ రాణిస్తూ, ఉన్నత స్థానాల్ని అలంకరిస్తున్న మైనారిటీ మిత్రుల స్ఫూర్తినీ, సమభావాన్ని స్నేహభావంతో ప్రదర్శించడంలో మాకు ఆదర్శమైన ఎందరో ఆత్మీయ మైనారిటీ వర్గీయుల్నీ – వారు మైనారిటీలని గుర్తు చేసుకోవాల్సిన అగత్యం కల్పించే రచనల ప్రయోజనం అర్థం కాక ఈ మంకె ఇస్తున్నాను. ఏది ఏమైనా ‘చూపుడు వేలు’ వంటి రచనల ప్రచురణకు స్వేచ్ఛనిచ్చే భరతావని సత్సంప్రదాయం అభినందనీయం. ఇదే సంప్రదాయం మన పొరుగు దేశాలు కూడా పాటించడానికి ఈ రచనలు ప్రేరణ కాగలవని ఆశిద్దాం. చూపుడు వేలు కథలో శిల్పానికి అభినందనలు. అందులో కథకుడి పాత్రలో నిజాయితీ ఉంది. అందుకే వివక్షపై తన భార్య రజియా అభిప్రాయాల్ని కూడా పొందుపరిచాడు.
ఎటొచ్చీ తనుండే వాతావరణంలోనే ఉంటూ, తనతో సహజీవనం చేస్తున్న ఓ మహిళకు కలిగిన అభిప్రాయాలు ఆలోచించతగ్గవి అని భావించడానికి బదులు, ఎవరిదో కుట్ర కారణంగా ఆమెకు అలాంటి అభిప్రాయాలు ఏర్పడినట్లు వ్రాశాడు. ఒకవేళ తన అభిప్రాయాలే – ఎవ్రిదో కుట్ర అనుకునేందుకు కూడా అలా ఆస్కారమిచ్చాడు. నిజానికి ఈ కథలో మిగతా నాలుగు వేళ్లూ రజియా పాత్రలోనే ఇమిడాయి.
తనకు తెలియకుండానే వాస్తవాల్ని కథలోకి చొప్పించడం ఉత్తమ రచయితల లక్షణమని ప్రముఖ కథకులు అంటారు. అఫ్సర్ గారికి మా అభినందనలు.

Leave a Reply

%d bloggers like this: