జూన్ 3, 2020

సరసమైన కథల పోటీ – ప్రతిలిపి

Posted in కథల పోటీలు, కథాజాలం, సాహితీ సమాచారం at 4:33 సా. by వసుంధర

వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యడండి

సరసమైన కథలు

భార్యాభర్తలు, ప్రేమికులు, బావ మరదళ్ల మధ్య జరిగే సరసాలు, రొమాంటిక్ సంఘటనల ఆధారంగా కథలను రాయడానికి ప్రతిలిపి మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. మీరు ఎంపిక చేసుకునే వర్గం ఏదైనా కానివ్వండి అయితే ఆ కథలో సరసం ప్రధానంగా ఉండాలి. కథలో వాడే భాష అసభ్యకరంగా ఉండకూడదు. అనైతిక సంబంధాల గురించి కాకుండా అందరూ చదువుకునేలా కథలు ఉండాలి. కథలు చదువుతుంటే ఒక తియ్యని రసానుభూతి రీడర్స్ కి కలిగేలా కథలను రాయాలని కోరుతున్నాము. ఆలస్యం ఎందుకు సరసమైన కథల పోటీకి మీరు రచించిన కథలను సబ్‌మిట్ చేయండి.

బహుమతులు :

1.మొదటి బహుమతి: 4000
2.రెండవ బహుమతి: 2000
3.మూడవ బహుమతి: 1000

ముఖ్యమైన తేదీలు :

1.చివరి తేది జూన్-28-2020
2.మీ కథలు జూన్-29-2020కథలను ప్రచురణ చేసి అదే రోజు ఫలితాలు ప్రకటించే తేదిని తెలియ పరుస్తాము.

నియమాలు :-

1.ప్రతి ఒక్కరు పదహైదు కథల వరకు సబ్‌మిట్ చేయవచ్చు. కథలు పూర్తిగా మీ సొంతమై ఉండాలి.
2.పూర్వం ప్రతిలిపిలో ప్రచురింపబడిన మీ కథలు పోటీకి సబ్‌మిట్ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణ అయినవి సబ్‌మిట్ చేయవచ్చు.
3.సాధ్యమైనంత వరకు అక్షర దోషాలు లేకుండా చూసుకోండి. కథల నిడివి పూర్తిగా మీ ఇష్టం. ప్రేమ, ప్రేరణ, రొమాంటిక్, సస్పెన్స్, మహిళా, హార్రర్ ఇలా వర్గం ఏదైనా పర్వాలేదు కానీ అందులో సరసం ఉండాలి.  

పోటీలో పాల్గొనే పద్ధతి :-

పోటీలో పాల్గొనడానికి క్రింది “పాల్గొనండి” బటన్ పై క్లిక్ చేసి ఇక్కడ వ్రాయండి అనే చోట కథను రాసి అప్‌లోడ్ బటన్ పై క్లిక్ చేసి, కథ యొక్క శీర్షికను జతచేసి తరువాత అనే బటన్ పై క్లిక్ చేసి కథకు తగిన ఫోటో అప్‌లోడ్ చేసి మళ్ళీ తర్వాత అనే బటన్ పై క్లిక్ చేయండి. కథ యొక్క వర్గాన్ని సెలెక్ట్ చేసుకొని కాపి రైట్స్ అంగీకరిస్తూ టిక్ మార్క్ ఇచ్చి కథను సబ్‌మిట్ చేయండి.  

అలాగే మీ రెండవ కథ, మూడవ కథ, నాలుగవ కథ, ఐదవ కథ కూడా సబ్‌మిట్ చేయగలరు. పదహైదు కథలు తప్పనిసరి కాదు. పదహైదు లోపు ఎన్ని కథలైన సబ్‌మిట్ చేయవచ్చు. మీరు సబ్‌మిట్ చేసిన కథలు మీ సమర్పణలు అనే శీర్షిక కింద ఉంటాయి. ఆ కథలను మాత్రమే మేము పోటీకి పరిగణిస్తాము. డ్రాఫ్ట్ లో ఉన్న కథలు పోటీలో ఉన్నట్లు కాదు. కావున గడువు లోపు మీ డ్రాఫ్ట్ లో ఉన్న కథలను సబ్‌మిట్ చేయాలి. 

ఫలితాలు ప్రకటించే పద్ధతి :

విజేతల ఎంపిక రచనలకు వచ్చిన పాఠకుల సంఖ్య, రేటింగ్ మరియు రచనను చదవడానికి పాఠకులు కేటాయించిన సమయం వీటిని పరిగణలోకి తీసుకోని మా సాంకేతిక వర్గం అందించే పట్టిక ఆధారంగా విజేతలను ప్రకటించబడును. మీ కథలను అత్యధిక పాఠకులకు చేరవేసే ప్రయత్నం చేస్తాము. ఫలితాల విషయంలో ఎలాంటి చర్చలకు అవకాశం లేదు. తేదీల విషయంలో ప్రతిలిపి నిర్ణయమే అంతిమం. 

సందేహాలకు : మెయిల్ – telugu@pratilipi.com  

పాల్గొనండి

Leave a Reply

%d bloggers like this: