జూన్ 8, 2020

న్యాయం మన ‘చెప్పు చేతల్లో’

Posted in సాంఘికం-రాజకీయాలు at 11:27 ఉద. by వసుంధర

ఒక రాజకీయ నేత ఓ అధికారి తీరు, మాటతీరు బాగోలేదని చెప్పుతో కొట్టారు.

ఆ విడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఆ ఆధికారి శిక్షార్హుడే అన్న అభిప్రాయం కొందరు వెలిబుచ్చారు. కానీ ఏ శిక్ష వెయ్యాలో, ఎలా వెయ్యాలో అన్నది నిర్ధారించడానికి న్యాయస్థానం అవసరముందా లేక న్యాయాన్ని ఇలా మన చెప్పుచేతల్లోకి తీసుకోవడం సమర్ధనీయమేనా అన్న ప్రశ్నకు సమాధానం కోసం కోట్లాది సామాన్యులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఎందుకంటే – ఈ దేశంలో ప్రముఖులుగా చెలామణీ ఔతున్నవారు ఎందరో తమ తీరు, మాటతీరుతో జనాల్ని తెగ విసిగిస్తున్నా రు. ఆ జనాల్లో ఆకలి చావులకు గురౌతున్నంత పేదవారు కూడా కాళ్లకు చెప్పులు కొనాలని తహతహలాడుతున్నారు.

Leave a Reply

%d bloggers like this: