జూన్ 10, 2020

సరికొత్త ఆలోచనలకు పురస్కారాలు

Posted in విద్యారంగం at 10:42 ఉద. by వసుంధర

స్కూల్​ పిల్లలకు లక్ష రూపాయల పోటీ: క్యాష్​ ప్రైజెస్​

🌱సీఎస్‌ఐఆర్ ఇన్నోవేషన్ అవార్డు

ప్రైవేటు, గవర్నమెంట్​ స్కూళ్లలో చదివే పిల్లలకు లక్ష రూపాయల బహుమతి గెలుచుకునే పోటీని సీఎస్​ఐఆర్​ (CSIR Council of Scientific and Industrial Research) ప్రకటించింది. నిత్యజీవితంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్‌కు పరిష్కారం చూపించే ఇన్నోవేటివ్ ఐడియా మీ దగ్గరుంటే చాలు.. వెంటనే ఈ పోటీలో పాల్గొనండి. పిల్లల్లో ఉన్న కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చేందుకు ఈ పోటీని నిర్వహిస్తోంది. 12వ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులందరూ పోటీలో పాల్గొనవచ్చు. 18 ఏళ్లలోపు వయస్సుండాలి.

🕯️ఫస్ట్ ప్రైజ్; రూ.లక్ష

🕯️సెకండ్ ప్రైజ్(ఇద్దరికి) రూ.50వేలు

🕯️థర్డ్ ప్రైజ్(ముగ్గురికి) రూ.30వేలు

🕯️ఫోర్త్ ప్రైజ్(నలుగురికి) రూ.20వేలు

🕯️ఫిఫ్త్ ప్రైజ్(ఐదుగురికి) రూ.10వేలు

🥀పూర్తి వివరాలకు ciasc.ipu@niscair.res.in కు మెయిల్ చేయవచ్చు లేదా http://www.csir.res.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

🎗️ఇన్నోవేటివ్ ఐడియా లేదా క్రియేటివ్ డిజైన్ లేదా సొల్యూషన్.. ఏదైనా ఇంగ్లిష్ లేదా హిందీలో 5000 పదాలకు మించకుండా రాయాలి. మీ స్కూల్ ప్రిన్సిపల్ ధ్రువీకరణతో పంపించాలి.

🏷️చివరి తేదీ; జూన్ 30 . ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో పంపించవచ్చు.

🏷️బెస్ట్ 15 ఎంట్రీలకు క్యాష్ ప్రైజ్‌తో పాటు సర్టిఫికెట్ అందిస్తారు.

Leave a Reply

%d bloggers like this: