స్కూల్ పిల్లలకు లక్ష రూపాయల పోటీ: క్యాష్ ప్రైజెస్
ప్రైవేటు, గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పిల్లలకు లక్ష రూపాయల బహుమతి గెలుచుకునే పోటీని సీఎస్ఐఆర్ (CSIR Council of Scientific and Industrial Research) ప్రకటించింది. నిత్యజీవితంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్‌కు పరిష్కారం చూపించే ఇన్నోవేటివ్ ఐడియా మీ దగ్గరుంటే చాలు.. వెంటనే ఈ పోటీలో పాల్గొనండి. పిల్లల్లో ఉన్న కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చేందుకు ఈ పోటీని నిర్వహిస్తోంది. 12వ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులందరూ పోటీలో పాల్గొనవచ్చు. 18 ఏళ్లలోపు వయస్సుండాలి.