జూన్ 11, 2020

అమెరికా సాహితీ సభా విశేష సంచిక

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం, Uncategorized at 11:16 ఉద. by వసుంధర

మిత్రులారా, 

గత నవంబర్ 2-3, 2019 తేదీలలో ఓర్లాండో మహా నగరం లో  జరిగిన 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో పాల్గొని దిగ్విజయం చేసిన తెలుగు భాషాసాహిత్యాభిమానులందరికీ మరొక సారి ధన్యవాదాలు.

మా సంస్థ సత్సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆ రెండు రోజుల సాహితీ సదస్సులో జరిగిన కార్యక్రమాల విశేషాలు పొందుపరిచిన సభా విశేష సంచిక ని ఇందుతో జత పరుస్తున్నాం.

భారత దేశం నుంచీ, అమెరికాలో అనేక నగరాల నుంచీ వచ్చిన అనేక మంది వక్తల ప్రసంగవ్యాసాలూ, ఆయా వక్తల పరిచయాలూ, గత సదస్సుల సింహావలోకనం, జీవన సాఫల్య పురస్కార విశేషాలు, వదాన్యులకి వందనాలు, సుమారు 100 ఫొటోలతో సదస్సు చిత్రమాలిక, 15 పైగా నూతన గ్రంధావిష్కరణల తో వెలువడిన ఈ సభా విశేష సంచిక పాఠకుల ఆదరణ పొందుతుంది అని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఆయా ప్రసంగాలనీ, ముఖ్య సంఘటనలనీ పదే, పదే వీక్షించి ఆనందించడానికి కావలసిన దృశ్యమాలిక వీడియో  లంకెలు సంచిక చివర్న ఇవ్వబడ్డాయి.

ఈ సభావిశేష సంచిక రూప కల్పనకి సహకరించిన వక్తలకీ, నిర్వాహక బృందానికీ మా హృదయ పూర్వక ధన్యవాదాలు.

Please review and enjoy the complete Proceedings of the 11th Telugu Literary Symposium of America, November 2-3, 2019, Orlando, FL. We welcome your sharing this free book to your friends & relatives who may be interested. Free Download of this and previous COnference Proceedings are available on www.kinige.com.

భవదీయులు,

వంగూరి చిట్టెన్ రాజు & మధు చెరుకూరి
సంపాదకులు
11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక   

Leave a Reply

%d bloggers like this: