జూన్ 18, 2020
ఎవరికోసం?

మనమంతా ఒకటనుకున్నా
మీరంతా నా వాళ్లనుకున్నా
దేశం కోసం పోరాడుతున్నా
పోరాటంలో ప్రాణాలొడ్డా
మరి మీరేమో దేశసేవ కోసం
కులమంటూ మతమంటూ
రాజకీయ కక్షలంటూ
మీలో మీరే పోరాడుకుంటుంటే
దేశమంటే మీరే అయినా
మీరెవరో నాకు తెలియక
మీకేమవుతానో నేనెరుగక
అమరత్వం నాదని నను కీర్తించే మీలో
అసురత్వం కనిపిస్తుంటే
అనిపిస్తోందిప్పుడు నాకు
ఈ నా పోరాటం, ప్రాణత్యాగం
ఎందుకోసం, ఎవరికోసం?
Leave a Reply