జూన్ 21, 2020
స్వర్ణాక్షర సంకలనం కవితల పోటీ
వాట్సాప్ బృందం సాహితీపల్లవం సౌజన్యంతో
[20:20, 20/06/2020] +91 99121 99394: స్వర్ణాక్షర సంకలనం కవితల పోటీ
14 వ ప్రకరణం గడువు 21. 6.2020 రాత్రి 8.00 వరకు :
అంశం :
“రాలిపోయి పడి ఎండిపోయిన ఆకుల్లా ,
కాకావికలైన నేటి మానవ సంభంధాలు.”
15 వ ప్రకరణం: గడువు 22.6.20 రాత్రి 8.00 వరకు.
అంశం :
” ముళ్ళతో ముడిపడిన జీవితం
కళ్ళ మాటున ఆణిముత్యాలు”
పంపవల్సింది :ఓపెన్ ఫార్మాట్ లోనే :
ramcnanduri@gmail.com కు.
చరవాణి : 9949188444.
మొత్తం 18 లైన్లు , హామీ పత్రంతో పాటు ; అంతర్జాల వేదికల్లో పోస్టు చేయరాదు , ప్రచురణకు పంపరాదు.
[20:20, 20/06/2020] +91 99121 99394: స్వర్ణాక్షర సంకలనం కవితల పోటీ
ప్రకరణ రెండు వాక్య అంశాలు :
16 వ ప్రకరణం :
ఈ మెయిల్ 23/6 న మాత్రమే రాత్రి 8.00 వరకు.
అంశం :
” మెలుకువతో మొదలు, నిద్రతో అంతం,
మనిషి జన్మలో మధ్యనే ఉన్నది అసలు అర్ధం “
17 వ ప్రకరణం:
ఈ మెయిల్ 24/6 న మాత్రమే రాతి 8.00 వరకు
అంశం:
“యదురుగా వున్నదొక మాయాలోకం ,
యవనిక చాటునున్న అంతరంగం.”
18 వ ప్రకరణం:
ఈ మెయిల్ 25/6 న మాత్రమే రాత్రి 8.00 వరకు.
అంశం :
” పుడమి పరిమళాల పరివేష్ఠితం
మన దేశం మానవీయతకు ప్రతీకం “
పంపవల్సింది :ఓపెన్ ఫార్మాట్ లోనే ,
Re అని ఉన్నచోట ప్రకరణం సంఖ్య వేస్తూ…
ramcnanduri@gmail.com కు.
చరవాణి : 9949188444.
మొత్తం 18 లైన్లు , హామీ పత్రంతో పాటు ; అంతర్జాల వేదికల్లో పోస్టు చేయరాదు , ప్రచురణకు పంపరాదు.
[20:20, 20/06/2020] +91 99121 99394: స్వర్ణాక్షర కవితా సంకలనం కవితా పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న కవులు, కవయిత్రులకు నాదొక మాట.
ముందుగా ధన్య వాదములు.
ఒక వైవిధ్య సరళిలో మొదలెట్టిన ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం …మీలో సృజనాత్మక శక్తి ని పెంపొందించాలి ,
భావ ఉత్పాదన విస్తీర్ణం పెంచాలి ,
భాషా ప్రయోగం అనురక్తిని కలిగించాలి అని.
దీనికి …ముందుగా…ఇచ్చిన రెండు వాక్యాలలో నిగూఢ అర్థం ఏదైనా ఉన్నదా అని తార్కిక దృష్టి తో చూడటం అవసరం , అంటే కొంత లోతుగా పరిశీలించడం.
దీనికి , ఒక ఉదాహరణ ( న్యాయ నిర్ణేత గారి నిర్ణయం ప్రకటించడం జరిగి పోయింది కాబట్టి. ) 13 వ ప్రకరణం లోని వాక్యాలు…
” అంబరంపై అగుపడే దృశ్యం లా
ఆమె ధరించిన దుస్తుల వైనం “
విప్పి చెప్పనిది కవిత్వం అని నిర్వచించారు సినారే గారు మనకందరికీ సూచన ఇస్తూ.
ఆకాశం లో అగుపడే దృశ్యాలు మనో నేత్రం తో చూస్తే ఎన్నో రకాలు , ఒకో సారి , ఒకో పరిస్థితుల్లో ఒకో విధంగా తోస్తూ..సుందరతకు ప్రతీక గా నిలవ వచ్చు , గగుర్పొడిచే భయాన్ని రెకిత్తించ వచ్చు ప్రళయ సూచనను కనబరుస్తూ ,
ఇంద్ర ధనుస్సూ , నీలి మేఘాలు , దూది పింజాలు …ఉషోదయ కిరణాలు , తారల మిరుమిట్లు , చంద్రుని చల్లని వెన్నెల….ఇన్ని రకాలుగా , వర్ణనాతీతం గా….
ఇప్పుడు ఈ పోలికను ఆమె ధరించిన దుస్తుల వైనం తో అన్వయించుకోవడం ప్రతి ఒక్కరి భావ పరంపర మీద , వైవిధ్యం మీద కదా ఆధార పడి ఉండేది.
చూపు చొరబడని దట్టపు మేఘాలు , తేలిపోతున్న దూది పింజాల మధ్య ఒక సారి స్ఫురణకు తెచ్చుకోండి. కనీ కనపడని తారలు గట్రా…
ఒక పేద ప్రౌఢ ధరించిన చిరిగిన వస్త్రాలతో పోల్చ వచ్చా , సరిపోతుందా ఈ పోలిక , ఈ దృష్టితో భావ వ్యక్తీకరణ చదువరులకు ఎలా ఉంటుంది , ఆసక్తిని కలిగించి , ఆలోచన లను రేకెత్తిస్తుందా ? ఆ విధంగా కవితా ప్రయోగం చేయ వచ్చా అన్నది ఆలోచించు తే… రచనలలో లోతు , గాంభీర్యం వస్తుందా అన్నది మీ చింతనకు వదిలి వేస్తున్నాను.
అలాగే…
” హరిత భరిత నందన వనం ,
భరిత హృదయ జీవన గమనం. “
చిన్నారి కృష్ణయ్య , రాధ , బృందావనం తలపుకు తెచ్చుకోవచ్చా అన్నది ఆలోచించండి. నందనవనం ఆన్న పదం ఒక ప్రతీకగా తీసుకుని.
హరిత శోభతో ఉంటేనే కదా నందనవనం నయనానందకరం.
భరిత హృదయం…సామాన్య పరిస్థితుల్లో ఇది…బరువు నిండిన గుండెకు సంకేతం కదా. పచ్చని నందన వనం ఎదురుగా ఉన్నా , ఆనందం అనుభవించలేని గుండె బరువుతో ఉన్న వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అన్నది ఊహించుకోండి.
లేక ఆ నందనవనం గుర్తుకు తెచ్చిన మరుగున పడ్డ జ్ఞాపకాలను తిరిగి స్ఫురణకు తెస్తే ?
ఇంకోటి ” భరిత హృదయం ” సంతోషంతో కూడా జరగ వచ్చు కదా.
ఇన్ని రకాల భావనలకు తావు కల్పించేవి ఈ రెండు వాక్యాలు , చాలా మట్టుకు . ఒక్కొక్కరూ ఒకో విధంగా అర్థం చేసుకుని , ఒకో భావనను
వ్యక్తీ కరించే అవకాశం ఉంది , ఈ పోటీలలో.
అక్కడే సృజనాత్మక శక్తి తెలిపేది , సాధన ద్వారా పెంపొందించుకునేదీనూ.
అందుకే నేను పదే పదే మీకు గుర్తు చేసేది , సూచించేది … త్వరపడ వద్దు.
కొద్దిగా మేధకు పని ఇవ్వండి ముందుగా. తరువాత భావ వ్యక్తీకరణ.
వ్రాసిన దానిని వెంటనే పంపక , ఓ రెండు గంటల తరువాత మార్పులు చేర్పులు చేయడం , తప్పులను సరి చేసుకోవడం చేసి పంపించండి. ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ అక్షరాలను ఉపయోగించి తెలుగు పదాలను టైప్ చేయడం లో మనకు తెలియకుండానే తప్పులు దొర్లుతాయి. వత్తులు , దీర్ఘాలు వగైరా సరి చూసుకోవడం అవసరం..
ఆఖరిగా…శీర్షిక…ఇవ్వండి కవితలకు.
విజేతలుగా నిలుస్తూ మంచి సాహిత్యం అందించండి .
శుభమస్తు.
Leave a Reply