జూన్ 30, 2020

అంతర్జాల అంతర్జాతీయ వెబినార్

Posted in సాహితీ సమాచారం at 3:52 సా. by వసుంధర

మద్రాసు క్రైస్తవ కళాశాల,తాంబరం,చెన్నై,తమిళనాడు,తెలుగు శాఖ ఆధ్వర్యం లో జూలై 15 & 16 ,2020  తేదీలలో  రెండు రోజుల అంతర్జాల అంతర్జాతీయ వెబినార్ జూమ్ ద్వారా నిర్వహించబడుతుంది.
అంతర్జాల అంతర్జాతీయ వెబినార్   అంశం :  తెలుగు సాహిత్యం –మానవతావాదం  

ఉప అంశాలు
1 . ప్రాచీన సాహిత్యం
(భారత ,భాగవత ,రామాయణాల ప్రత్యేక అధ్యయనం ) –మానవతా విలువలు

2 .శైవ మరియు భక్తి  సాహిత్యం –మానవతా దృక్పథం

3 . ప్రబంధ,దక్షిణాంధ్ర సాహిత్యం –మానవీయకోణం

4 .ఆధునిక సాహిత్యం (శతకం,కథ,నవల ,నాటకం ,కవిత్వం  వంటి మొదలైన సాహిత్య ప్రక్రియల ప్రత్యేక అధ్యయనం)   –మానవతా
ధోరణులు

5 . జానపద , గిరిజన సాహిత్యం –మానవత్వపు విలువలు

  వీటిలో  మీకిష్టమైన అంశాన్ని తీసుకొని పరిశోధన పత్రం సమర్పించవచ్చు .పరిశోధన పత్రాలను యూ జి సి కేర్ జర్నల్ లో ప్రచురించగలం.మీ పరిశోధన పత్రాలను tmcc120@gmail.com అనే మెయిల్ ఐడి కి 12 /07 /2020 లోపు పంపగలరు.పరిశోధన పత్రాలను పేజీమేకర్ అను 7 ప్రియాంక  పాంట్ 18 ,లైన్ స్పేస్ 21 లో 4 లేదా 5 పేజీలలో సమర్పించవలెను.

రిజిస్ట్రేషన్ ఫీజు లేదు
ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు https://docs.google.com/forms/d/e/1FAIpQLSdbhoQQVzclZDI9KzsXMOkALf5mEoxT92ZoG_XCaoLJAh3LIw/viewform  

 రిజిస్ట్రేషన్ తర్వాత వచ్చే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కాగలరు.https://chat.whatsapp.com/GTlDrWJjkQvCYfmVGW5UB6

వివరాలకు

డా శ్రీపురం యఙ్ఞశేఖర్
శాఖాధిపతి
తెలుగు విభాగం
మద్రాసు క్రైస్తవ కళాశాల,తాంబరం,
చెన్నై,తమిళనాడు
చరవాణి
9840 600189

Leave a Reply

%d bloggers like this: