జూన్ 30, 2020

తెలుగుకూటమి అంతర్జాతీయ అంతర్జాల సమావేశం

Posted in కథల పోటీలు, కవితాజాలం, సాహితీ సమాచారం at 1:04 సా. by వసుంధర

తెలుగు భాష అమృతభాష కావలసిన నేపథ్యంలో ప్రపంచంలో గల అనేక మంది తెలుగువారు తెలుగు మాట అనే ఒక వాట్సప్ గ్రూపు మరియు ఒక అంతర్జాల గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. అందులో అనేకమంది ఆచార్యులు, మంత్రులు, ఉన్నత అధికారులు, భాషాభిమానులు సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఒక తెలుగు కూటమి ఏర్పాటు చేసుకుని తెలుగు భాష ఉద్యమాన్ని నడుపుతూ తెలుగు కోసం మనం ఏం చేయగలం అని ఒక నినాదంతో అంతర్జాతీయ అంతర్జాల సదస్సు ప్రతి 15 రోజులకు ఒకసారి అనగా నెలలో రెండు సార్లు నిర్వహించడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఈనెల 27వ తేదీ శ్రీ పారుపల్లి కోదండరామయ్య గారి అధ్యక్షతలో సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు సమావేశం జరిగింది.
సమావేశంలో అమెరికా నుండి శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు, శ్రీ తోటకూర ప్రసాద్ గారు, శ్రీకాశ్యప్ గారు, మారిషస్ నుండి శ్రీసంజీవ అప్పడు గారు, బొంబాయి నుండి ఆచార్య ఫణి గారు, కళారత్న శ్రీ పొట్లూరి హరికృష్ణ గారు, శ్రీ దీర్ఘాశి విజయ భాస్కర్ గారు మరియు తెలుగు భాషా ఉద్యమాన్ని అత్యున్నత స్థాయిలో నిర్వహిస్తూ కృషి చేస్తున్న అనేకమంది భాషాభిమానులు పాల్గొన్నారు.
విజయనగరంలో తెలుగు కూటమి సంఘ సమావేశము శ్రీ గురజాడ అప్పారావు గారి స్వగృహంలో వారి మునిమనవడు ప్రసాద్ మరియు ఇందిరా చేతుల మీదుగా మొట్టమొదటిగా ఏర్పాటుచేసి, ఆస్ట్రేలియాలో తెలుగు పత్రిక “తెలుగు పలుకు” నడుపుతున్న శ్రీనివాస్ గారి కుటుంబాన్ని ఆహ్వానించిన శ్రీమతి శ్రీలక్ష్మి గారు మాట్లాడవలసిందిగా వారు అవకాశం ఇచ్చారు. ముందుగా అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయనగరంలో జిల్లా కలెక్టర్ గారైన శ్రీ హరిజవహర్లాల్ గారు తెలుగు భాష పై అభిమానంతో విజయనగరంలో గల ముఖ్యమైన కూడలి స్థలములలో సాంస్కృతిక విజయనగరం, విద్యల విజయనగరం, క్రీడల విజయనగరం మొదలగు పేర్లు గల హోర్డింగ్స్ పెట్టించారు. తాను తెలుగు భాషపై అభిమానంతో తెలుగు పాటలు నేర్చుకొని సందర్భానుసారంగా ప్రజలను భాష పట్ల ఉన్ముఖులను చేస్తున్నారు అని తెలిపారు.
కరోనా వ్యాధి ఉద్ధృతస్థాయిలో ఉన్నందున వీధుల్లోకి వచ్చి భాషా ప్రచారం చేయలేము. కనుక

3 నుండి 15 సంవత్సరముల వయస్సు గల బాల బాలికలు ముందుగా తమ తల్లిదండ్రులకు నమస్కారము చేసి తమకు తెలిసిన తెలుగుభాషలో పద్యము, పాట, లేదా కథ ఒకదానిని వీడియో చేసి 9441957325 వాట్సాప్ నెంబర్ కు పంపిన యెడల యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు.
అదేవిధంగా
16 నుండి 21 సంవత్సరాల వయసువారు
తెలుగు భాష గురించి 15/20 వరుసలో కవిత రాసి స్వయంగా చదివిన వీడియో పంపించగలరు.
ప్రపంచవ్యాప్తంగా గల తెలుగువారందరూ చూడడానికి అవకాశం కల్పించగలనని శ్రీలక్ష్మీ గారు తెలిపారు.
తెలుగు భాషాభిమానులు, తెలుగువారందరూ
ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరడమైనది.
పాల్గొన్న వారందరికీ వారి పూర్తి పేరు ఊరు రాసి, ప్రముఖుల సంతకాలతో ప్రశంసాపత్రం
ఆన్లైన్ లో అందించగలరు.

పారుపల్లి కోదండ రామయ్య గారు అధ్యక్షులు తెలుగు కూటమి హైదరాబాద్

చివుకుల శ్రీలక్ష్మి
అధ్యక్షులు
తెలుగు కూటమి
విజయనగరం

Leave a Reply

%d bloggers like this: