జూలై 10, 2020
వ్యాలీ వేదిక

మిత్రులారా,
రేపు శుక్రవారం అనగా జులై పదవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు, వ్యాలీ వేదిక, కాలిఫోర్నియా వారు నిర్వహిస్తున్న చర్చా వేదికలో ‘మాతృభాషా వికాసానికి ఆచరణీయ మార్గాలు’ అనే అంశం మీద సత్యం మందపాటి గారూ, వంగూరి చిట్టెన్ రాజు..అంటే నేనే…నిర్వహిస్తున్న చర్చలో పాల్గొనమని మిమ్మల్నందరినీ ఆహ్వానిస్తున్నాము. క్రింద ఇచ్చిన పత్రంలో అన్ని వివరాలు, వలసిన లంకె వున్నాయి. ఈ చర్చా వేదిక తర్వాత శ్రీ మాడుగుల నాగ గురునాథ శర్మ గారి సాహిత్య ప్రసంగం (30 నిముషాలు) ఉంటుంది…అది మీరు విన వలసిన ప్రసంగం.
సమయం:
కాలిఫోర్నియా: 6 PM -8 PM
హ్యూస్టన్: 4 PM- 6 PM
ఇండియా: July 11 (శనివారం) ఉదయం 6:30 నుండి 8:30 దాకా.
తెలుగు మాట బృందం, తెలుగు కూటమి వారూ మన భాషా వికాసం కోసం ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి, మీలో ఎవరైనా ఈ చర్చలో పాల్గొనదల్చుకుంటే నిర్వాహకురాలు శారద కాశీవజ్జుల గారిని ముందస్తుగా సంప్రదించండి.ఆమె వాట్సాప్ నెంబర్: +1 (408) 650-9192
ఈ చర్చా కార్యక్రమాన్నీ, సాహిత్య ప్రసంగాన్నీ మీరు ఈ క్రింది యుట్యూబ్ లంకె లో హాయిగా చూడవచ్చును.
http://www.youtube.com/valleyvedika
భవదీయుడు,
వంగూరి చిట్టెన్ రాజుPhone: 832 594 9054
Leave a Reply