…..వ్యాసాలకు ఆహ్వానం….
నేను ఆ విశ్వేశ్వరుని ( ప్రపంచం లో ఏ పేరుతో ఉన్నా శక్తీ , తత్వం ఒక్కటే) నమ్ముతాను. నాలో ఇంకా జీవం ఉన్నందున ఈ సమాజ సామరస్యానికి పురోగతికి నా వంతు కృషి చేయటం నా విద్యుత్ ధర్మం గా భావిస్తూ , ఒక అడుగు ముందుకు వేస్తున్నాను.
నేటి తెలుగు వారి, భారత ప్రజల సాంఘిక జీవనం లో ఎన్నో రుగ్మతలు, విభేదాలు, వైషమ్యాలు,సమస్యలు సమాజంలో శాంతిని హరిస్తూ ఏకత్వంలో భిన్నత్వం ఆన్న భారత దేశంలో అనాది నుంచి అమలులో ఉన్న విధానానికి , గండి పెడుతున్నాయి. ఉదాహరణకు కులమత బేధాలు, రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ పరమైన అవకాశాలు, అవినీతి, ప్రేమ- పెళ్లి ; పెద్దల కోప తాపాలు , చట్టం అతిక్రమణలు , సామాజిక వేదికల లో రెచ్చ కొట్టటాలు,
అక్రమ అమానుష అఘాయిత్యాలు , ప్రజలు తమ బాధ్యత విస్మరించిన ప్రవర్తన ఇత్యాది…
ఈ నేపథ్యంలో చదువరుల నుంచి 5 పేజీలు మించకుండా టైప్ చేసిన వ్యాసాలను ఆహ్వానిస్తున్నాను.
సమస్యలను యెత్తి చూపటం కాదు, వాటిని సామరస్యంగా పరిష్కరించే మార్గం చూపాలి. అప్పుడే మీ రచనకు గుర్తింపు ఉంటుంది, అని గుర్తు పెట్టుకోవడం ముఖ్యం , వ్యాసాలు పంపించే వారు.
వ్యాసాలు 31.07. 2020 లోపల నాకు ఈ మెయిల్ చేయాలి.
ఇది పూర్తి సమాజ హితమైన కార్యక్రమం కాబట్టి నా ఈ సందేశాన్ని విరివిగా ఇతరులకు పంచండి. ఎవరి మేధ చక్కని సూచనలను చేయ గలదో మనకు తెలియదు కదా.
ఎవ్వరు అయినా పంపించ వచ్చు..ఎవ్వరూ అనర్హులు కారు.
ఎన్నిక అయిన వ్యాసాలకు తగిన గుర్తింపు ఉంటుంది.
ధన్యవాదాలు…భవదీయుడు.
ramcnanduri@gmail.com