జూలై 24, 2020

సాహస కథల పోటీ – ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 6:56 సా. by వసుంధర

లంకె

సాహసం చేయరా ఢింబకా

సాహస కథలు చదివితే మనలో ధైర్యం, ఆత్మస్థైర్యం, ఇతరులు కష్ట కాలంలో ఉన్నప్పుడు సహాయం చేసే గుణం, మానవత్వం లాంటివి పెరుగుతాయి. సమాజాన్ని మెరుగుపరచడానికి సాహస కథలు ఎంతో ఉపయోగపడతాయి. ప్రతిలిపి ఈ నెల ‘సాహసం చేయరా ఢింబకా’ అనే శీర్షికతో సాహస కథలను ఆహ్వానిస్తోంది. సాహస కథలు రాసి మెరుగైన సమాజం కోసం మీ వంతు బాధ్యతను నిర్వహించండి.

బహుమతులు :

1.మొదటి బహుమతి: 4000
2.రెండవ బహుమతి: 2000
3.మూడవ బహుమతి: 1000

ముఖ్యమైన తేదీలు :

1.చివరి తేది జూలై-28-2020
2.మీ కథలు జూలై-29-2020కథలను ప్రచురణ చేసి అదే రోజు ఫలితాలు ప్రకటించే తేదిని తెలియ పరుస్తాము.

నియమాలు :-

1.ప్రతి ఒక్కరు పదహైదు కథల వరకు సబ్‌మిట్ చేయవచ్చు. కథలు పూర్తిగా మీ సొంతమై ఉండాలి.

2.పూర్వం ప్రతిలిపిలో ప్రచురింపబడిన మీ కథలు పోటీకి సబ్‌మిట్ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణ అయినవి సబ్‌మిట్ చేయవచ్చు.
3.కథను ప్రచురణ చేసేటప్పుడు సంగ్రహం తప్పనిసరిగా రాయాలి. సంగ్రహం అంటే కథ దేని గురించి రాస్తున్నారో తెలుపుతూ మూడు వాక్యాల్లో రాయడమే.

పోటీలో పాల్గొనే పద్ధతి :-

పోటీలో పాల్గొనడానికి క్రింది “పాల్గొనండి” బటన్ పై క్లిక్ చేసి ఇక్కడ వ్రాయండి అనే చోట కథను రాసి అప్‌లోడ్ బటన్ పై క్లిక్ చేసి, కథ యొక్క శీర్షికను జతచేసి తరువాత అనే బటన్ పై క్లిక్ చేసి కథకు తగిన ఫోటో అప్‌లోడ్ చేసి మళ్ళీ తర్వాత అనే బటన్ పై క్లిక్ చేయండి. కథ యొక్క వర్గాన్ని సెలెక్ట్ చేసుకొని కాపి రైట్స్ అంగీకరిస్తూ టిక్ మార్క్ ఇచ్చి కథను సబ్‌మిట్ చేయండి.  

అలాగే మీ రెండవ కథ, మూడవ కథ, నాలుగవ కథ, ఐదవ కథ కూడా సబ్‌మిట్ చేయగలరు. పదహైదు కథలు తప్పనిసరి కాదు. పదహైదు లోపు ఎన్ని కథలైన సబ్‌మిట్ చేయవచ్చు. మీరు సబ్‌మిట్ చేసిన కథలు మీ సమర్పణలు అనే శీర్షిక కింద ఉంటాయి. ఆ కథలను మాత్రమే మేము పోటీకి పరిగణిస్తాము. డ్రాఫ్ట్ లో ఉన్న కథలు పోటీలో ఉన్నట్లు కాదు. కావున గడువు లోపు మీ డ్రాఫ్ట్ లో ఉన్న కథలను సబ్‌మిట్ చేయాలి. 

న్యాయనిర్ణేత అందించే ఫలితాలు ఆధారంగా:-

కథలను మా న్యాయనిర్ణేతల ప్యానెల్ చదివి ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాలపై ఎలాంటి వాదోపవాదాలకు ఆస్కారం లేదు.

సందేహాలకు : మెయిల్ – telugu@pratilipi.com   పాల్గొనండి

Leave a Reply

%d bloggers like this: