జూలై 28, 2020

వెబినార్ – మాతృభాష మాధ్యమం

Posted in భాషానందం, సాహితీ సమాచారం at 5:00 సా. by వసుంధర

నమస్తే !హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారు జులై 29, 30 తేదీల్లో “జ్ఞాన సముపార్జన మాధ్యమం మాతృభాష” అనే అంశం గురించి అంతర్జాతీయ అంతర్జాల సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషా ప్రముఖులు 25 మంది వివిధ రంగాలలో మాతృభాష ప్రాముఖ్యత గురించి మాట్లాడనున్నారు.  29న మధ్యాహ్నం 2.20కి “ఆకాశవాణి ప్రసారాలు: మాతృభాష ప్రాధాన్యం” అనే అంశం గురించి నేను పత్రం సమర్పిస్తున్నాను. పూర్తి వివరాల కోసం ఆహ్వాన పత్రం చూడగలరు. 
29న ఉదయం జరిగే ప్రారంభ సభ విశిష్టమైనది. భారత ఉపరాష్ట్రపతి మాన్యులు ము. వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా ఉ.10.00కి అరగంట సేపు తమ ప్రసంగం చేయనున్నారు. ఆయన సమయపాలన గురించి మనకు తెలుసు కాబట్టి వెబినారుకు ఉ. 9.50 కల్లా (భారత కాలమానం) లాగిన్ అవమని నిర్వాహకులు చెబుతున్నారు. అందరూ ఆడియో మ్యూట్ లో ఉంచాలి, వీడియోలో ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూసుకోవాలి. 
గూగుల్ మీట్ లంకె ఇదీ : 
https://stream.meet.google.com/stream/d3d1c014-2985-4189-9368-435a57826218
తెలుగు భాషకు సేవ చేయాలనే ఉత్సాహంతో ఉన్న ఈ సమూహ సభ్యులందరూ ఈ సదస్సుకు విచ్చేయాలని నా ఆహ్వానం, విన్నపం. 
మోహిత కౌండిన్య 9985287398

Leave a Reply

%d bloggers like this: