వసుంధర అక్షరజాలం

పి.వి.గారిపై కావ్యరచనకు ‘సాహితీ సిరికోన’ ఆహ్వానం

పి.వి.గారిపై కావ్యరచనకు ‘సాహితీ సిరికోన’ ప్రకటన
**

” నేర్చుకోడానికి వయసు,వగైరా అడ్డు కాదు..
అహం అడ్డు రాకూడదు” అంటూ దాన్ని ఆచరించి చూపిన తెలుగు తేజస్సముద్దీప్త మూర్తి,
శ్రీ పీవీ గారి శతజయంతి సందర్భంగా ప్రత్యేక ప్రకటన…

శ్రీ పీవీ గారి శతజయంతిని పురస్కరించుకుని సిరికోన ప్రత్యేక కవితా పురస్కారానికి గాను పద్య కావ్యాన్ని కానీ, దీర్ఘ వచన కవితాకావ్యాన్ని కానీ
‘సాహితీ సిరికోన’ వాక్స్థలి బృంద వేదిక/ సాహిత్య దిన పత్రిక
ఆహ్వానిస్తున్నది…
2020 డిసెంబరు31 లోగా రాతప్రతిని సిరికోనకు సమర్పించాలి.
ఉభయ రాష్ట్రాలలో కానీ, రాష్ట్రేతర ప్రాంతాలలో కానీ ఉన్న తెలుగు కవులైనా ఇందులో పాల్గొనవచ్చు..

ఉత్తమ కావ్యం గా ఎంపికైన దాన్ని 500 ప్రతులు సిరికోన ముద్రించి రచించిన వారికి సమర్పిస్తూ, నగదు మొత్తంతో పాటు సముచిత రీతిలో సన్మానితుల్ని చేస్తుంది. వచ్చే ఏడాది మార్చి – ఏప్రిల్ మధ్యలో జరిగే సిరికోన సాహిత్యోత్సవంలో ఈ సన్మానం ఘనంగా నిర్వహింపబడుతుంది…

ఒకవేళ పద్యకావ్యం/ వచన కవితా దీర్ఘకావ్యం అనే రెండు ప్రక్రియలలోనూ సమానస్థాయిలోని ఉత్తమ కృతులుంటే, రెంటికీ పురస్కృతి సమర్పించ బడుతుంది…

శ్రీ పీవీ గారి జీవితం, రాష్ట్ర ,దేశ, అంతర్దేశ స్థాయిలో వారి సేవలు, సామాజిక–తాత్విక దృష్టి, వారి జీవన సాధనలు,సాధించిన విజయాలు, విశేషాలు, చేసిన సంస్కరణలు ఇత్యాదులను ఇతివృత్తంగా తీసుకొని, తెలుగు తేజ ఘనతా ప్రస్తుతిగా, స్ఫూర్తి దాయకంగా కావ్యాన్ని రచించవలసిందిగా విజ్ఞప్తి….

ముద్రణలో కనీసం 60 పుటలకు తగ్గకుండా రావాలి… ఖండాలుగా,అధ్యాయాలుగా విభజించుకొని రాస్తే ఆ మాత్రం రాయటం పెద్ద కష్టం కాదు…

ఈ కావ్యం సిరికోనకే ప్రత్యేకంగా సమర్పించబడాలి…. ఫేస్బుక్, సా.మా.సమూహాలు ఇత్యాదులలో ముందే ప్రకటితమైతే, పురస్కృతికి పరిశీలించబడవు…

-- ఇంకా వివరాలకై  సంప్రదించాల్సిన ఫోన్ సంఖ్యలు:

+91 944180 9566
(గంగిశెట్టి లక్ష్మీనారాయణ)
+91 99488 96984
(జొన్నవిత్తుల శ్రీరామ చంద్రమూర్తి)

Exit mobile version