ఆగస్ట్ 5, 2020

కామన్వెల్త్ చిన్నకథల పోటీ

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 12:54 సా. by వసుంధర

ఈ సమాచారం అందజేసిన వాట్‍సాప్ బృందానికి ధన్యవాదాలు.

కృతిక పాండే. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రచయిత. ఈ ఏడాది కామన్వెల్త్ కథల పోటీలో మొదటి బహుమతి £5000 అంటే అక్షరాలా రూ. 4,90,217 పొందింది. లంకె

2000 – 5000 పదాల ఓ అద్భుతమైన కథ రాస్తే చాలు, మనమూ విజేతలము కావొచ్చు.

మీకు పాలగుమ్మి పద్మరాజు గారి “గాలివాన” కథ గురించి తెలిసే ఉంటుంది. తెలుగు కథకి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చింది. మరి మనమూ మన తెలుగు కథకి ఆ ఖ్యాతి తేలేమా!!

కృతిక రాసిన కథ చదివాను. హిందూ ముస్లింల ప్రేమ కథ. ఆమె ఆ కథా గమనాన్ని, శిల్పాన్ని చక్కగా మలచి, విజేత అయ్యారు.
మన తెలుగు సంస్కృతి, జీవన వైవిధ్యం చాలా గొప్పది. దానిని చిత్రీకరిస్తూ ఎన్నో అద్భుతమైన కథలు రాస్తున్న ఔత్సాహిక రచయితలు ఎందరో ఉన్నారు. వారందరికీ ఈ పోస్ట్ ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయం.

తెలుగు కథ పైసాకి కూడా పనికిరాదు. సాహిత్యంలో డబ్బులు సంపాదించడం కష్టం అని నేను కథలు రాసే మొదట్లో అందరూ చెప్పేవారు. అందులో కొంత వాస్తవం లేకపోలేదు కానీ ఇటువంటి సువర్ణ అవకాశాలతో, తెలుగు కథను అనువదించి పంపుదాం. పోయేదేం లేదుగా..

Try where there is no expenditure..
మనకేం నష్టం లేనప్పుడు ప్రయత్నిస్తే పోయేదేం లేదుగా
.. ఇది నా ఊత వాక్యం.. మా స్నేహితులతో ఎప్పుడూ చెబుతూ ఉంటాను. 🤭

కాబట్టి ,
సెప్టెంబర్ 1 నుండి మొదలయ్యే ఈ పోటీకి ముందుగానే ఒక మంచి కథను సిద్ధం చేసుకుందాం. మీకు ఇంగ్లీష్ రాకపోతే, ఇంగ్లీషులో అనువదించి కూడా పంపొచ్చు. ఎవరైనా అనువాదకులు ఉంటే, వారితో అనువాదించండి.

పోటీ నియమాలు:-
1) 18 సం. పై బడిన వారు మాత్రమే పాల్గొనాలి.
2) కామన్వెల్త్ దేశాలకు చెందినవారే అయ్యి ఉండాలి.
3) ఎక్కడా ప్రచురితం కానీ రచనలు మాత్రమే పంపాలి.
4) డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటే, అంటే రెండు దేశాల పౌరసత్వం ఉన్నట్లు అయితే, శాశ్వత ఆవాసం ఎక్కడ ఉందో అదే పరిగణలోకి తీసుకుంటారు.
5) యెటువంటి రిజిస్ట్రేషన్ రుసుము లేదు. ఉచితంగా పాల్గొనవచ్చు.
6) pdf format , font size 12 ఉండాలి.
ఇంకా మామూలు నియమాలు చాలా ఉన్నాయి. అవన్నీ మీరు ఈ లంకెలో తెలుసుకోవచ్చు.

బహుమతి :-
మొదటి బహుమతి:- £5000 ( ₹4,90,217.44)
మిగతా నాలుగు బహుమతులు ఒక్కొక్కదానికి – £2500 (₹2,45,841.03)

ఈసారి మనమూ ప్రయత్నిద్దాం.. మరో పాలగుమ్మి పద్మరాజు గారిలా మనమూ అవుదాం..
(పోటీ మొదలయ్యాక మరోసారి మళ్లీ మీకు గుర్తు చేస్తాం)

2020 బహుమతికి ఐదు ప్రాంతీయ విజేతలు:
ఆఫ్రికా: నైజీరియా రచయిత ఇన్నోసెంట్ చిజారామ్ ఇలో ఒక మహిళ మాతృత్వాన్ని పరిత్యజించారు.
ఆసియా: ది గ్రేట్ ఇండియన్ టీ అండ్ స్నేక్స్ కోసం భారత రచయిత కృతికా పాండే
కెనడా మరియు యూరప్: మిస్టర్ జెన్సన్ వెళ్ళిన చోట బ్రిటిష్ రచయిత రేయా మార్టిన్.
కరేబియన్: మాఫూటూ కోసం జమైకా రచయిత బ్రియాన్ ఎస్ హీప్. 
పసిఫిక్: ది ఆర్ట్ ఆఫ్ వేవింగ్ కోసం ఆస్ట్రేలియా రచయిత ఆండ్రియా ఇ మాక్లియోడ్.
కామన్వెల్త్ లఘు కథ బహుమతి గురించి:
●కామన్వెల్త్ నుండి ప్రచురించబడని లఘు కథల యొక్క ఉత్తమ భాగానికి 2012 నుండి కామన్వెల్త్ లఘు కథ బహుమతి లభిస్తుంది.  ఆసియా, పసిఫిక్, ఆఫ్రికా, కెనడా మరియు యూరప్ మరియు కరేబియన్ అనే ఐదు ప్రాంతీయ విజేతలకు ఈ బహుమతి ఇవ్వబడుతుంది. ప్రతి విజేత పౌండ్ 2,500 (సుమారు రూ. 2.4 లక్షలు) అందుకుంటాడు మరియు వారిలో మొత్తం విజేత మొత్తం పౌండ్ 5,000 (సుమారు రూ. 4.72 లక్షలు) అందుకుంటాడు. 

Leave a Reply

%d bloggers like this: