ఆగస్ట్ 10, 2020

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

Posted in భాషానందం, సాహితీ సమాచారం at 11:22 ఉద. by వసుంధర

మిత్రులారా,
రాబోయే అక్టోబర్ 10-11, 2020 లో అంతర్జాలం లో (జూమ్ వీడియో) 24 గంటలు, నిర్విరామంగా న్యూ జీలండ్ నుంచి అమెరికా దాకా జరుగుతున్న ప్రతిష్టాత్మక 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ప్రపంచవ్యాప్తం గా ఉన్న తెలుగు భాషా, సాహిత్యాభిమానులకీ, పండితులకీ, రచయితలకీ, వక్తలకీ సాదర ఆహ్వానం.
గత 14 ఏళ్ళలో నాలుగు ఖండాలలో ఉన్న ఐదు దేశాలలో (భారత దేశంలో హైదరాబాద్ , అమెరికాలో హ్యూస్టన్ మహా నగరం, యునైటెడ్ కింగ్డం లో లండన్ మహా నగరం, సింగపూర్, ఆస్త్రేలియా లొ మెల్ బోర్న్) దిగ్విజయంగా జరిగిన ప్రపంచ సాహితీ సదస్సుల పరంపరని ఈ కరోనా సమయం లో కూడా కొనసాగించే ఈ 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు జొహానెస్ బర్గ్ (దక్షిణ ఆప్రికా) ప్రధాన నిర్వహణ కేంద్రంగా అంతర్జాలం లో నిర్వహించబడి ఆఫ్రికా ఖండం లో తొలి సాహితీ సదస్సు గా తెలుగు సాహిత్య చరిత్రలో మరొక సారి నూతన అధ్యాయాన్ని సృష్టించబోతోంది.
ప్రాధమిక వివరాలకి ఇందుతో జతపరిచిన వీడియో & సంక్షిప్త ప్రకటనలు చూడండి. పూర్తి వివరాలు…త్వరలోనే….
Vedio Link: https://www.youtube.com/watch?v=WkIOGKsX2Zg&t=38s

Leave a Reply

%d bloggers like this: