ఆగస్ట్ 13, 2020
నాట్స్ కవితల పోటీ ఫలితాలు
భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా “నా దేశం-నా జెండా” అనే అంశంపై నాట్స్ నిర్వహించిన కవితల పోటీకి 913 కవితలు అందగా వారిలో తొమ్మిది మందిని న్యాయనిర్ణేతలు విజేతలుగా ప్రకటించారు.
అయితే ఈ తొమ్మిది మందిలో ఎవరు ఏ పురస్కారాన్ని గెలుచుకున్నారన్నది 14 ఆగస్ట్ సాయంత్రం ఈ విజేతలతో జరిపే ఆన్లైన్ కవిసమ్మేళనం అనంతరం తెలియజేస్తాము.
“నా దేశం-నా జెండా” కవితల పోటీలో గెలుపొందిన తొమ్మిది మంది విజేతలు వీరే:
కిరణ్ విభావరి
శిరీష మణిపురి
జోగు అంజయ్య
నూజిళ్ల శ్రీనివాస్
దోర్నాధుల సిద్ధార్థ
వినీల్ క్రాంతి కుమార్ (శతఘ్ని)
చెరుకూరి రాజశేఖర్
అల్లాడి వేణు గోపాల్
వంగర పరమేశ్వర రావు
14 వ తేదీ సాయంత్రం 8:30 గంటల IST నుంచి ప్రసారం కాబోయే ఆన్లైన్ కవిసమ్మేళనంలో పై విజేతలతో పాటూ నలుగురు సినీ గీతరచయితలు కూడా పాల్గొని వారి కవితలు చదవబోతున్నారు.
ఆ నలుగురు సినీకవులు వీరే:
- శ్రీ చంద్రబోసు
- శ్రీ భాస్కరభట్ల రవికుమార్
- శ్రీ రామజోగయ్య శాస్త్రి
- శ్రీ సిరాశ్రీ
ఇట్లు
రాజశేఖర్ అల్లాడ
సూర్యం గంటి
సంచాలకులు- నాట్స్ కవితల పోటీ
Leave a Reply