సెప్టెంబర్ 1, 2020

కొల్లారపు పద్యరచనామృత బోధిని

Posted in కవితాజాలం, భాషానందం, సాహితీ సమాచారం, Uncategorized at 6:32 సా. by వసుంధర

తెలుగు భాషాభిమానులారా…

నేను వ్రాసిన  
“కొల్లారపు పద్యరచనామృత బోధిని” పుస్తకావిష్కరణము కొన్ని రోజుల క్రితము జరిగింది.  ముగ్గురు ప్రముఖ అవధానుల చేతులమీదుగా  పుస్తకావిష్కరణము కావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.   

ఈ పుస్తకాన్ని తెలుగు భాషను, అందునా పద్యసాహిత్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వ్రాసాను.  అలా కాపాడుతున్న బుధులందరికి ఈ పుస్తకాన్ని అంకితం కాడా చేసాను. 

*  PDF రూపంలోని పుస్తకముకై (ఉచితం) నాకు WhatsApp message పెట్టండి: 703-728-4757 లేక kollarapu.bodhini@gmail.com కు E-mail పంపండి. పంపిస్తాను. 
*  E-Book లేక ప్రింటెడ్ పుస్తకములకు లింకు క్రింద ఇచ్చాను.  

ఈ బోధినిని (200 పుటలు) వాడి వర్థమాన కవులు ఛందోబద్ధ పద్య రచనను సులభశైలిలో నేర్చుకోవచ్చు.  నాతోబాటు తెలుగుభాషామతల్లి సేవలో పాలు పంచుకొంటారని ఆశిస్తున్నాను; తెలుగు పద్యముకు పూర్వవైభవం తెద్దాం 🙏
https://store.prowesspub.com/padya-rachanamrutha-bodhini

కొల్లారపు ప్రకాశరావు శర్మ
“పద్యరచనామృతబోధిని “ గ్రంధకర్త
వాషింగ్టన్, డి.సి. 
WhatsApp 703-728-4757

దీనికి ఓ భాషాభిమాని ఆవేదపూరిత స్పందన చదవండిః

మిత్రులారా,వాషింగ్టన్ నుంచి పద్యాలు రాయటం నేర్పుతారు. కాలిఫోర్నియా నుంచి మన బడి చదువులు చెప్తారు.డల్లాస్ నుంచి భాషోద్యమం ఉంటుంది.
ఇక, ఎంతో దూరం లేదు; ఇక్కడికి తెలుగు బడి పంతుళ్ళను కూడ మీరే పంపాలి.
R. V. శాస్త్రి.

Leave a Reply

%d bloggers like this: