వసుంధర అక్షరజాలం

పిల్లల కథల పోటీ – ప్రతిలిపి

లంకె

బాల సాహిత్య కథల పోటీలో పాల్గొని నగదు బహుమతులు పొందండి
బాల రాజ్యంబాల సాహిత్యం ద్వారా పిల్లలకు నీతి, వినోదం, విజ్ఞానం, సాహసం, పట్టుదల, ధైర్యం, మంచి-చెడు ఇలా ఎన్నో విషయాలను అర్థమయ్యేలా కథల రూపంలో చెప్పవచ్చు. పిల్లలకు నేరుగా చెప్పడం కంటే కథల రూపంలో చెప్పడం ద్వారా మెదడులో బాగా నాటుకుపోతుంది. పిల్లల కోసం ఇంకా విస్తృతంగా బాల సాహిత్యంలో రావాల్సి ఉన్నది. అందులో భాగంగా ప్రతిలిపి “బాల రాజ్యం” శీర్షికతో బాల సాహిత్య కథల పోటీలు నిర్వహిస్తోంది.

బహుమతులు :

1.మొదటి బహుమతి: 4000
2.రెండవ బహుమతి: 2000
3.మూడవ బహుమతి: 1000

ముఖ్యమైన తేదీలు :

1.చివరి తేది సెప్టెంబర్-28-2020
2.మీ కథలు సెప్టెంబర్-29-2020కథలను ప్రచురణ చేసి అదే రోజు ఫలితాలు ప్రకటించే తేదిని తెలియ పరుస్తాము.

నియమాలు :-

1.ప్రతి ఒక్కరు పదహైదు కథల వరకు సబ్‌మిట్ చేయవచ్చు. కథలు పూర్తిగా మీ సొంతమై ఉండాలి.
2.పూర్వం ప్రతిలిపిలో ప్రచురింపబడిన మీ కథలు పోటీకి సబ్‌మిట్ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణ అయినవి సబ్‌మిట్ చేయవచ్చు.

3. కథలు ఎంత నిడివి అయినా ఉండవచ్చు.

పోటీలో పాల్గొనే పద్ధతి :-

పోటీలో పాల్గొనడానికి క్రింది “పాల్గొనండి” బటన్ పై క్లిక్ చేసి ఇక్కడ వ్రాయండి అనే చోట కథను రాసి అప్‌లోడ్ బటన్ పై క్లిక్ చేసి, కథ యొక్క శీర్షికను జతచేసి తరువాత అనే బటన్ పై క్లిక్ చేసి కథకు తగిన ఫోటో అప్‌లోడ్ చేసి మళ్ళీ తర్వాత అనే బటన్ పై క్లిక్ చేయండి. కథ యొక్క వర్గాన్ని సెలెక్ట్ చేసుకొని కాపి రైట్స్ అంగీకరిస్తూ టిక్ మార్క్ ఇచ్చి కథను సబ్‌మిట్ చేయండి.

అలాగే మీ రెండవ కథ, మూడవ కథ, నాలుగవ కథ, ఐదవ కథ కూడా సబ్‌మిట్ చేయగలరు. పదహైదు కథలు తప్పనిసరి కాదు. పదహైదు లోపు ఎన్ని కథలైన సబ్‌మిట్ చేయవచ్చు. మీరు సబ్‌మిట్ చేసిన కథలు మీ సమర్పణలు అనే శీర్షిక కింద ఉంటాయి. ఆ కథలను మాత్రమే మేము పోటీకి పరిగణిస్తాము. డ్రాఫ్ట్ లో ఉన్న కథలు పోటీలో ఉన్నట్లు కాదు. కావున గడువు లోపు మీ డ్రాఫ్ట్ లో ఉన్న కథలను సబ్‌మిట్ చేయాలి.

న్యాయనిర్ణేత అందించే ఫలితాలు ఆధారంగా:-

కథలను మా న్యాయనిర్ణేతల ప్యానెల్ చదివి ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాలపై ఎలాంటి వాదోపవాదాలకు ఆస్కారం లేదు.

సందేహాలకు : మెయిల్ – telugu@pratilipi.com
పాల్గొనండి
Exit mobile version