సెప్టెంబర్ 7, 2020

నాటా 2020 సాహిత్య పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు, కవితల పోటీలు, బొమ్మల పోటీలు, సాహితీ సమాచారం at 12:32 సా. by వసుంధర

పై ఫలితాలను ప్రకటిస్తూ నాటా ఈ నెల 5న ఒక సభను నిర్వహించింది. కరోనా కాలంలో అటువంటి సభను – ఒక సాహిత్యసభగా – అర్థవంతంగా, అపూర్వంగా నిర్వహించి సాహిత్యాన్ని గౌరవించడం 2020లో చెప్పుకోతగ్గ విశేషం. పోటీలపై న్యాయనిర్ణేతలు వెలిబుచ్చిన అభిప్రాయాలు – తెలుగు సాహిత్యానికి ఆశాజనకమూ, ప్రోత్సాహమూనూ. పాల్గొన్నవారు ప్రతిష్ఠాత్మక హోదాల్లో ఉండి కూడా, వినయభూషణులై, హుందాగా – సాహిత్య సభానిర్వహణకు ఆదర్శప్రాయులై సభకు వన్నెలు దిద్దారు. విజేతలకు, నిర్వాహకులకు అభివందన పూర్వక శుభాకాంక్షలు.

ఆ సభావిశేషాలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. చూసేక మీ అభిప్రాయాల్ని తెలియజేస్తే, వారికి ఉత్సాహమూ, ప్రోత్సాహమూ కలిగి – తెలుగు సాహితి మరింతగా శోభించేందుకు దోహదం కాగలదు.

Leave a Reply

%d bloggers like this: