https://drive.google.com/file/d/1xNEUrGR6VFVEoH0GpiFPM8A1TqXH0WYG/view?usp=sharing
అందరికీ 54వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ మరియు మా నాన్నగారు కీ॥శే॥ అద్దంకి కేశవరావుగారి 102వ జయంతి శుభాకాంక్షలు.
ఈ సందర్భంగా మీరు ఒక అమూల్యమైన కానుకనందుకోబోతున్నారు. మానాన్న గారు ఒక కవిగా, ఉపాధ్యాయుడుగా, కళాకారుడుగా, సంగీతజ్ఞుడుగా తన జీవిత కాలంలో రాసిన పలు రచనలను ఒక సింగిల్ టచ్ తో ఎంతో నిరాడంబరంగా మీకు మీరే స్వయంగా ఆవిష్కరించుకోబోతున్నారు. నిజం. మీకు సమయం చిక్కినపుడు పై లింకును టచ్ చేసి ఎవరికి వారే ఈ పీడీఎఫ్ సంకలనాన్ని మీ మొబైల్ లో ఆవిష్కరించుకోవచ్చు.
దీని ఆవిష్కరణ కోసమని zoom appలోనో, google meet లోనో, facebook live లోనో సభ నిర్వహించి ఈకోవిడ్ -19 కష్ట కాలంలో ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదనే సదుద్దేశంతోనే ఇలా ఈ మినీ గ్రంథాలయాన్ని నేరుగా మీకందచేస్తున్నాను. కరోనా లాక్డౌన్ సెలవులను ఈ పనితో సద్వినియోగం చేశానని భావిస్తున్నాను.
ఇందులో ప్రైమరీ పిల్లలకు రైమ్స్ పుస్తకం తో బాటు హైస్కూలు విద్యార్ధులకు ప్రముఖుల చరిత్ర కథలు, Proverbs – Expansions ఉన్నాయి. యువతకు నచ్చే దేశభక్తి గీతాల, రాధికాసాంత్వన గీతాల పుస్తకాలు ఆడియోలతో సహా ఉన్నాయి. ఒకప్పటి బుర్రకథలూ ఉన్నాయ్ . పెద్దల కోసం స్వాతంత్ర్యోద్యమ సమయంలో రాసిన ఖండ కావ్యాలు, నవలలు, నాటకాలు, నాటికలు, ఏకపాత్రలు, కథలు ఉన్నాయి. స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి ‘రెడ్డి’ అనే ప్రాంతీయ పక్ష పత్రిక ఉంది. కొత్తపేట హైస్కూలులో 1956లో రామకృష్ణా భవనం ప్రారంభ సందర్భంగా జరిగిన బుద్ధజయంతి సంచిక ఉంది. Cubbing, Scouting, Guiding లకు చెందిన ఆంగ్ల పుస్తకాలున్నాయి. ఒక ఆయుర్వేద పుస్తకమూ ఉంది. ముఖ్యంగా ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన శాంతి సందేశాన్నందించే సమగ్ర బౌద్ధ గ్రంథం ‘తథాగతీయము’ పద్య కావ్యముంది. ఈ గ్రంథం చక్కగా అర్ధం కావడానికి దీనిపై పరిశోధన చేసిన డా॥ దేవవరపు నీలకంఠరావుగారి సిద్ధాంత వ్యాసముంది.
చివర అనుబంధాలలో నాన్నగారి విగ్రహం, పాటల కేసెట్, సిడి, పుస్తకావిష్కరణల జ్ఞాపకాలు, వాటికి సంబంధించిన వివిధ దినపత్రికల రివ్యూలు, వార్తలు ఆల్బమ్స్ రూపంలో ఉన్నాయ్. ఇంకెందుకాలస్యం. వెంటనే ఈ సరికొత్త మొబైల్ గ్రంథాలయంలోకి ప్రవేశించి మీకు నచ్చిన పుస్తకం చదువుకోండి. చాలావరకు పాత అముద్రిత రాతప్రతులేనండోయ్. అక్కడక్కడ ఇబ్బంది పెడతాయ్ మరి. ఇదో కొత్త అనుభవమనుకుని చదివి మీ స్పందనను తెలియచేస్తారని ఆశిస్తూ…
సదా అందరి శ్రేయోభిలాషి
అద్ధంకి బుద్ధ చంద్ర దేవ్,
S/o అద్దంకి కేశవరావు,
వ్యవస్థాపకులు,
ప్రియదర్శినీ బాలవిహార్,
కొత్తపేట, తూర్పుగోదావరి జిల్లా,
తేది: 8-9-2020
ఫోన్: 9989244202