సెప్టెంబర్ 9, 2020

బతుకమ్మ కథల పోటీ – గడువు పెంపు

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 4:12 సా. by వసుంధర

లంకె

పోటీ ప్రధాన ఉద్దేశం 

సంస్కృతి, చరిత్ర, సమకాలీన జీవన వైవిధ్యాల, వైరుధ్యాల నేపథ్యంలో కథ ఉండాలి. నవ్యతకు, సృజనాత్మకతకు పెద్దపీట వేసే కథలకు మాత్రమే ఆహ్వానం పలుకుతున్నాం.  పోటీకి వచ్చిన కథలలో ఉత్తమమైన 22 కథలనుఎంపిక చేస్తాం. 

 • బహుమతి పొందిన కథలు నమస్తే తెలంగాణ ‘బతుకమ్మ’లో ప్రచురితం అవుతాయి. 
 • పది కథలను సాధారణ ప్రచురణ కోసం స్వీకరిస్తాం. ఈ కథలకు వెయ్యి రూపాయలతోపాటు,జ్ఞాపికలు అందజేస్తాం.  
 • బహుమతి పొందిన కథలు పుస్తక రూపంలో కూడా అచ్చు వేసే అధికారం పోటీ నిర్వాహకులకు ఉంటుంది. 
 • ప్రథమ బహుమతి (ఒక్కరికి)    రూ.  50,000
 • ద్వితీయ బహుమతులు ఇద్దరికి (ఒక్కొక్కరికి)  రూ.  25,000     
 • తృతీయ బహుమతులు ముగ్గురికి(ఒక్కొక్కరికి)   రూ.  10,000   
 • కన్సొలేషన్‌ బహుమతులు ఆరుగురికి(ఒక్కొక్కరికి)    రూ.  5,000

నియమ నిబంధనలు

 • ఇంతకు ముందు ఎక్కడా (ప్రింట్‌ పత్రికలలో గానీ, వెబ్‌ పత్రికలలో గానీ, వ్యక్తిగత బ్లాగులలో గానీ, సోషల్‌ డియాలోగానీ) ప్రచురితం కాని కథలను మాత్రమే పోటీకి పంపాలి.  ఇప్పటికే ఎక్కడైనా పరిశీలనలో ఉన్న రచనలు పోటీకి అనర్హం.
 • పై అంశాలను ధృవీకరిస్తూ హామీపత్రం తప్పనిసరిగా జతపరచాలి.  ప్రచురణకు అంగీకరించని రాతప్రతులను తిరిగి  పంపడం సాధ్యం కాదు. 
 • ఒకరు ఎన్ని కథలైనా పంపొచ్చు. రచనకు ఏ కలం పేరు వాడినా రచయిత / రచయిత్రి అసలు పేరు, పూర్తి చిరునామా, ఫోన్‌ నంబర్‌ తప్పనిసరిగా హామీ పత్రంలో రాయాలి. కథ  అనువాదంగానీ, అనుకరణగానీ, అనుసరణకానీ కాదని హామీపత్రంలో స్పష్టం చేయాలి.
 • పోటీలో ఏ బహుమతి పొందిన కథనైనా, ఫలితాలు వెలువడిన తరువాత వెనక్కి తీసుకునే అవకాశం కథా రచయితలకు లేదని గమనించగలరు.
 • బహుమతుల విషయంలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు. రచయితలకు ప్రాంతీయ భేదం లేదు. ఏ రాష్ట్రమైనా, ఏ దేశంలో ఉన్న తెలుగు వారైనా కథలు పంపవచ్చు. 
 • విజేతలకు ముల్కనూరులో   బహుమతుల ప్రదాన కార్యక్రమం ఉంటుంది. కథలపోటీ ఫలితాలు నమస్తే తెలంగాణ బతుకమ్మలో ప్రచురితం అవుతాయి.

పంపాల్సిన విధానం 

 • రాత ప్రతి అయితే  కథ 12 పేజీలు మించకుండా ఉండాలి. 
 • ఈ-మెయిల్‌ ద్వారా పంపేవారు యూనికోడ్‌లో వర్డ్‌ఫైల్‌ పంపవచ్చు. దాన్ని పీడీఎఫ్‌లోకి కూడా మార్చి ఎటాచ్‌ చేయాలి. 
 • పేజ్‌మేకర్‌లో డీటీపీ చేయించి కథను పంపేవారు పీఎమ్‌డీ ఫైల్‌ను, పీడీఎఫ్‌ను కూడా జత చేసి ఆ రెండింటినీ 
 • ఈ-మెయిల్‌లో ఎటాచ్‌ చేసి పంపాలి. 
 • డీటీపీ, వర్డ్‌ఫైల్‌ ఏ4 సైజులో 14 నుంచి 16 ఫాంట్‌లో నాలుగు, ఐదు పేజీలకు మించకూడదు. 
 • పదాల్లో అయితే కథ 1500 పదాలకు మించకూడదు. 
 • హామీపత్రం జత చేయడం మర్చిపోవద్దు.
 •  కథల ప్రతులపైన రచయిత / రచయిత్రి పేరు ఉండరాదు. విడిగా హామీపత్రం పైన మాత్రమే పేరు ఉండాలి. 

కథలు పంపాల్సిన చిరునామా 

బతుకమ్మ కథలపోటీ, నమస్తే తెలంగాణ

# 8-2-603/1/7, 8, 9, రోడ్‌ నంబర్‌ 10, 

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌  500 034.

మీ కథలు పంపాల్సిన ఈ -మెయిల్‌ ఐడీ : sunmag@ntnews.com

కథలు మాకు అందాల్సిన చివరి తేదీ : సెప్టెంబరు 15, 2020

Leave a Reply

%d bloggers like this: