సెప్టెంబర్ 15, 2020

కవిత్వ పోటీలు

Posted in కవితల పోటీలు, సాహితీ సమాచారం at 4:31 సా. by వసుంధర

కవికోకిల గుఱ్ఱం జాషువా జయంతి సందర్భంగా కవిత్వ పోటీలు ……………………………………….. పద్మభూషణ్ గుర్రంజాషువా జయంతిని పురస్కరించుకొని సి.పి.బ్రౌన్ సేవాసమితి, బెంగళూరు తరపున కవితా పోటీలను నిర్వహిస్తున్నాం. ఈ పోటీలను రెండు విభాగాలుగా నిర్వహించదలచాం. మొదటి విభాగం:  పద్యకవిత్వం – అంశం- “కరోనాకాలంలో వలస కార్మికుల జీవితం” ( సీస పద్యాలైతే 3పద్యాలకు మించకుండా మిగిలిన ఛందస్సు పద్యాలైతే 5పద్యాలకు మించకుండా రాసి పంపించాలి.) బహుమతుల వివరాలు:   మొదటి బహుమతి ః మూడు వేల రూపాయలు (3,000) రెండవ బహుమతి ః రెండు వేల రూపాయలు (2,000)   మూడవ బహుమతి ః ఒక వెయ్యి రూపాయలు (1,000)   10  ప్రోత్సాహక బహుమతులుః ఒక్కోటి ఐదువందల రూపాయలు (500* 10= 5000 రూపాయలు )
రెండవ విభాగం:  వచన కవిత్వం- అంశం- “కరోనాకాలంలో వలస కార్మికుల జీవితం”(25 పంక్తులకు మించకుండా వచన కవిత్వం రాసి పంపించాలి.)  బహుమతుల వివరాలు:  మొదటి బహుమతి ః మూడు వేల రూపాయలు (3,000) రెండవ బహుమతి ః రెండు వేల రూపాయలు (2,000) మూడవ బహుమతి ః ఒక వెయ్యి రూపాయలు (1,000) 10  ప్రోత్సాహక బహుమతులుః ఒక్కోటి ఐదువందల రూపాయలు (500* 10= 5000 రూపాయలు )  గమనిక : రెండు విభాగాలకు విడివిడిగా బహుమతులు ఇవ్వబడతాయని గమనించగలరు.

 గుర్రం జాషువా  గారి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పోటీలో పాల్గొని విజయంవంతం చేస్తారని ఆశిస్తున్నాం. మీ పద్యాలు jashuvapadyam@gmail.com మెయిల్ కు, వచనకవితలు jashuvavachanakavitvam@gmail.com మెయిల్ కు ఈ నెల 23 వతేదీ లోపు పంపించాలి. పోటీలోపాల్గొనాలనుకునేవారు ఈ link ద్వారా whatsapp గ్రూపులో చేరవచ్చు. https://chat.whatsapp.com/FJ9HdFt3JHyE9fp2wPwQcZ పోటీకి పంపించే మీ పద్యాలను గానీ, వచన కవిత్వాన్నిగానీ ఈ గ్రూపులో post చేయవద్దు. ఈ గ్రూపు కేవలం జాషువా పోటీలకు సంబంధించిన సమాచారం కొరకు మాత్రమే… కాబట్టి ఇతరవిషయాలను పోస్ట్ చేయవద్దనేది మరో విన్నపం.ఒకవేళ ఎవరైనా నియమాన్ని మీరితే గ్రూపునుంచి తొలగించడం జరుగుతుంది.(మీరు పోటీలో పాల్గొనేవారైనా సరే…కాబట్టి పోస్టులు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని తెలియచేస్తున్నాం) నిర్వహణ:   ఇడమకంటి లక్ష్మీరెడ్డి,అధ్యక్షులు  సి.పి.బ్రౌన్ సేవాసమితి, బెంగళూరు.

2 వ్యాఖ్యలు »

  1. Group lo join avvalekapotunnam sir. Group full ani choopistondi.

    • మాకు ఇంతకుమించి సమాచారం లేదు. మన్నించగలరు.


Leave a Reply

%d bloggers like this: