సెప్టెంబర్ 21, 2020

కరోనా కథలు, కవితల పోటీ ఫలితాలు – భారతీయ జనతా యువమోర్చా

Posted in కథల పోటీలు, కవితల పోటీలు, సాహితీ సమాచారం at 10:38 ఉద. by వసుంధర

1 వ్యాఖ్య »

  1. ‘నేను వసుంధర అక్షరజాలం రెగ్యులర్ గా చూసి పోటీలకు నా కథలు పంపడానికి ట్రై చేస్తాను. ఇంతకు మునుపు ఏదైనా డౌట్ వస్తే మీకు రాసేదాన్ని వాఖ్యలలో.
    నిన్న ఒక డౌట్ గురించి రాయబోతే ప్రోసెస్ మారింది. నాకు WORDPRESS అకౌంట్ లేదు. ఏమి చెయ్యాలో తెలియలేదు. అందుకే ఇలా మీకు మెయిల్ చేస్తున్నదుకు క్షమించండి. నా డౌట్. APBJYM వారు జూన్ 15 న ప్రకటిస్తామన్న కథలపోటీ ఫలితాలు మరో నెల తరువాత ప్రకటిస్తామని జవాబు ఇచ్చారు. ఇప్పుడు సెప్టెంబర్ కూడా దాటి పోతోంది’,
    ఈ పోటీ రిజల్ట్స్ సంగతి చెబుతారా? నేను నా కథను ఇతర పత్రికలకు పంపుకోనా అని మెయిల్ ఇచ్చినా స్పందన లేకపోతె ఏమి చెయ్యాలి? వారి సమాధానం మాకు తెలిసే విధానం ఎలా? ప్లీస్ మీరు హెల్ప్ చెయ్యగలరా? –
    ఒక రచయిత్రినుండి మాకు అందిన మెయిల్ ఇది. పోటీలు నిర్వహించినవారు – విజేతలకే కాక పాల్గొన్న అందరికీ ఫలితాలు అందే ఏర్పాటు చెయ్యడం మంచి సంప్రదాయం. అక్షరజాలానికి సంబంధించినంతవరకూ ఈ పోటీ ఫలితాలు విజేతలద్వారా పుస్తకరూపంలో మాకు అందాయి. విడిగా ఫలితాల ప్రకటన లేదు. పుస్తకంలో మొత్తం కథలు, కవితలు ప్రచురితం కావడంవల్ల – అక్షరజాలంలో అందించవచ్చునో కూడదో తెలియక ఉపేక్షించడం జరిగింది. ఈ రచయిత్రి ఉత్తరం చూసేక – ఆ పుస్తకంలోంచి ఫలితాలను వేరు చేసి ఇక్కడ ఇస్తున్నాం. పోటీల నిర్వాహకులు పాల్గొనేవారి సౌకర్యాన్ని గమనించేందుకు ఈ టపా సహకరిస్తుందని అశ.


Leave a Reply

%d bloggers like this: