సెప్టెంబర్ 27, 2020

మొబైల్ యాపు పోటీ – 2020

Posted in ఇతర పోటీలు, సాహితీ సమాచారం at 4:52 సా. by వసుంధర

తెలుగు భాషోద్యమ సమాఖ్య వారి మొబైల్ యాపు పోటీ – 2020

మొబైల్ యాప్ పోటీలో పాల్గొనాలనుకునేవారు మూడు విధాలుగా మొబైల్ యాప్‌లను రూపొందించవచ్చు –

 1. యాండ్రాయిడ్ – గూగుల్ ప్లే స్టోర్ లోకి నేరుగా ఎగుమతిచేయాలి
 2. ఐఓఎస్ – యాపిల్ యాప్‌స్టోర్ లోకి నేరుగా ఎగుమతిచేయాలి
 3. వెబ్ యాప్ ను- ఒక నిర్ణీత గూగుల్ ఫారం ద్వారా అందించవచ్చు.
  నిబంధనలు:
 4. యాప్ తెలుగులోనే ఉండాలి. తెలుగు ఆటలు, పాటలు, సాహిత్యం, తెలుగు భాష, సంస్కృతి, చరిత్రలను తెలిపే విధంగా ఆటలను రూపొందించవచ్చు. లేదా తెలుగు భాషను నేర్పే యాప్‍లు కావచ్చు, తెలుగులో ఛందస్సు, సంధులు, భాషాభాగాలను గుర్తించే యాప్ కావచ్చు, లేదా తెలుగు దిద్దరి (స్పెల్ చెకర్), వ్యాకరణ నిర్దుష్టతను తెలిపే యాప్‌లు, తెలుగు సాహిత్య అవగాహనను పెంచేవి కావచ్చు.
 5. ఈ పోటీలో అందరూ పాల్గొనవచ్చు.
 6. ఒకరే రూపొందించవచ్చు లేదా జట్టుగా పాల్గొని రూపొందించవచ్చు. బహుమతి రూపొందించిన వ్యక్తికి లేదా జట్టుకి అందిస్తాం. పేరు, చిరునామా, ఈమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్ నమోదు పత్రంలో చేర్చాలి.
 7. ఈ పోటీకి సమర్పించే మొబైల్/వెబ్ యాప్, పోటీ తరువాత అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచాలి.
 8. మొబైల్ యాప్ లేదా వెబ్ యాప్ లో వాడుకరికి కనిపించే భాగమంతా తెలుగు యూనికోడ్‌లోనే ఉండాలి.
 9. భారతదేశ చట్టాలకు అనుగుణంగా యాప్ సృష్టి జరగాలి
 10. మొదటి బహుమతి, 1 – అక్షరాలా 1 లక్ష రూపాయల నగదు.
  రెండవ బహుమతి, 2 – అక్షరాలా 50 వేల రూపాయల నగదు.
  మూడవ బహుమతి, 3 – అక్షరాలా 33 వేల 333 రూపాయల నగదు.
 11. పాల్గొన్న వారందరికీ ప్రమాణపత్రం ఇస్తాము, పాల్గొన్నవారి పేర్లను/జట్టు పేరును మనం రూపొందించబోయే జాలస్థలంలో ప్రచురిస్తాము.
 12. పోటీకి సంబంధించిన ఉత్తర-ప్రత్యుత్తరాల కోసం tebhasapoti@gmail.com ఈ-వేగు ద్వారా మాత్రమే సంప్రదించాలి. నిర్వాహకులను, పోటీకి సంబంధించిన వ్యక్తులను వ్యక్తిగతంగా సంప్రదించవద్దు.
 13. పోటీ మొదలు తేదీ : 29 ఆగస్టు, 2020
  యాపులు సమర్పించేందుకు ఆఖరు తేదీ : 1 జనవరి 2021 మధ్యాహ్నం 12 గం॥ లకు.
 14. యాపుల ఎంపికలో న్యాయనిర్ణేతలదే అంతిమ నిర్ణయం, ఇందుకు ఎలాంటి వివాదాలకు చోటు లేదు.
  మొబైల్ యాపు పోటీ నమోదు, సమర్పణ ఫారము – https://forms.gle/koWxehnW6unooDsW8

Leave a Reply

%d bloggers like this: