సెప్టెంబర్ 29, 2020

దీపావళి కథల పోటీ – కథామంజరి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 11:59 ఉద. by వసుంధర

దీపావళి పండగ అంటే .. తెలుగు లోగిళ్ళ లో  టపాసులతో పాటుదీపావళి ప్రత్యేక సంచికలు కూడా సందడి చేసేవి. ప్రఖ్యాత రచయిత(త్రి)ల ప్రత్యేక కథలుకవితలతో నిండైన ఆ సంచికలు,  దీపావళి వెళ్లిన తర్వాత కూడా,  తెలుగువారి ఇళ్లల్లో శాశ్వతంగా నిలిచేవి.  ఆ సంచికల్లో కథలుకవితలు ప్రచురణ కావడం.. రచయితలకు ఓ గుర్తింపుగా ఉండేది. ఆనాటి తెలుగు కథా వైభవాన్ని తలుచుకుంటూ… కథా మంజరి .. వచ్చే దీపావళికి ప్రత్యేక సంచిక ప్రచురించాలనే తలంపుతో.. “దీపావళి కథల పోటి” నిర్వహించదలచమని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం. రచయిత(త్రి)లందరూ తమ తమ రచనలను పంపికథలపోటిని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.

 
మొదటి బహుమతి : రూ. 5000
రెండవ బహుమతి  :  రూ. 3000
మూడవ బహుమతి: రూ. 2000
 
ప్రత్యేక సంచికలో చోటుచేసుకునే మరో 12  కథలకు రూ. 500/- చొప్పున బహుమతి ఉంటుంది.
  
పోటీ నిబంధనలు:

1. కథాంశం ఏదైనా పరవాలేదు.
2. కథలను word లో యూనికోడ్ లోఅక్షరాలు 12′ సైజులో టైపు చేసి పంపవలెను.
3. కథలు ఆ టైపింగ్ లో 5 పేజీలకు మించి ఉండకూడదు రచయిత పేరు, చిరునామాహామీ పత్రం 6వ పేజీలో           తప్పనిసరిగా ఉండాలి. ఈ పేజిలోనే “దీపావళి కథల పోటీకి” అని రాయాలి.
4ఏ రచయిత అయినా సరేమూడు కథలకు మించి పంపకూడదు.
5కథలు మరే ఇతర పద్దతులలో పంపిన ఎడల స్వీకరింపబడవు.
6పోటీలో ఎంపిక అయిన కథలన్నీ దీపావళి ప్రత్యేక సంచికలో ముద్రితమవుతాయి. అవి కాకసాధరణ ప్రచురణకు స్వీకరింపబడే కథలను వీలువెంబడి కథామంజరిలో ప్రచురణ అవుతాయి. ఆ కథల జాబితా కథమంజరి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడతాయి. మిగతా కథలు స్వీకరింపబడలేదనే విషయం ఆయా రచయితలు గమనించాలి.
7కథలను ఈ క్రింది చిరునామాకు ఇమెయిల్ ద్వారానే పంపాలి.
submit@kathamanjari.in
8ఆఖరి తేది: 25.10.2020 రాత్రి 10.00 గంటలు
9ఈ పోటీ మీద తుది నిర్ణయాలు తీసుకునే అధికారం కథా మంజరి నిర్వాహకులదే.
 
కథా మంజరి – నవంబరు 2020 సంచిక  దీపావళి ప్రత్యేక సంచికగా 14.11.2020 న విడుదల అవుతుంది. పాఠకులు, రచయితలు గమనించగలరు.
 
కథా మంజరి దీపావళి ప్రత్యేక సంచిక మీ యింట  కొత్త వెలుగులను అందిస్తుందని అభిలషిస్తూ.. ఈ ప్రయత్నానికి మీ సహాయసహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాం!
 
నిర్వాహక బృందం
కథా మంజరి

2 వ్యాఖ్యలు »

  1. పి.రాజేంద్రప్రసాద్ said,

    కథల పోటీలలో పేజీలకు, ఫాంటులకు ఒక పరిమితిని నిర్ణయిస్తే రచయిత అనుకున్న విధంగా ఆ కథానిక రావచ్చు, రాకపోవచ్చు. గొప్ప గొప్ప కథలు ఏ పరిమితికీ లోబడవనే విషయం నా లాంటి అల్పజ్ఞులకంటే పోటీలు నిర్వహించే పెద్దలకే బాగా తెలుసునని నమ్ముతున్నాను. పోటీ నిర్వాహకులకు ప్రచురణా సమయంలో ఇబ్బంది ఉండవచ్చనే విషయం సమర్ధనీయమే. కాని రచయితలను చట్రాలలో బిగిస్తే మంచి రచనలు రాకపోవచ్చు. అంతకంటే మంచి పద్ధతి ఏమిటంటే మా పరిమితులు ఇవీ అని పేర్కొంటూ కొంచెం అటూ ఇటుగా స్వీకరిస్తామంటే ఉభయతారకంగా ఉంటుంది. కా రా మాష్టారి ‘యజ్ఞం’ కానీ ఆయన వ్రాసిన ఇతర కథలు గానీ ఏ పరిమితులకూ లోబడవని గుర్తు చేస్తున్నాను.

    • మీరు వ్రాసింది అక్షరాలా నిజం. గతంలో కథ నిడివి 12 పేజీలు ఉండేవి. తర్వాత 10 నుంచి క్రమంగా 6, 7, 8 పేజీలకు దిగింది. ఇప్పుడు 5. కథ నిడివి 5-10 పేజీలకు అవకాశమిస్తే కొంతలో కొంత మెరుగు. ఐతే ఇది స్పీడు యుగం. పెద్ద కథలు చదవడానికి ఇష్టపడేవారి సంఖ్య బాగా తగ్గింది. పాఠకుల అభిరుచి మేరకే పత్రికలు పరిమితులు రూపొందిస్తున్నాయి. ఆ పరిమితులకు లోబడే అంశాలనే కథకులు ఎన్నుకోవాలి. యజ్ఞం వ్రాసిన కారా మేస్టారు కార్డు కథలు కూడా వ్రాశారు. ఒక విధంగా ఇది కథకులకు సవాలు. కాలానుగుణంగా మారక తప్పదు. ఐతే కథకు 5-10 పేజీల పరిమితి ఆదర్శం అన్నది మా అభిప్రాయం.


Leave a Reply

%d bloggers like this: