సెప్టెంబర్ 30, 2020

చంద్రమోహన్ స్మారక పురస్కారం

Posted in విద్యారంగం, సాంఘికం-రాజకీయాలు at 7:57 సా. by వసుంధర

వసుంధర విజ్ఞాన వికాస మండలి
సామాజిక, సాంస్కృతిక యువ చైతన్య వేదిక
రినెం-4393-96, స్థాపితం-1993
8వ కాలనీ, గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా

28 ఏండ్లుగా సామాజిక, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో సేవలందిస్తున్న మన సంస్థ గత ఐదేండ్లుగా సంస్థ సభ్యుడు చంద్రమోహన్ పేరుతో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి స్మారక పురస్కారం అందిస్తున్న విషయం తెలిసిందే. గతంలో పల్లెపాటి సంపత్రావు( కమాన్పూర్ విద్యాధికారి), మేజిక్రాజా( అడ్డగుంటపల్లి ప్రభుత్వ పాఠశాల ), వైరాగ్యం ప్రభాకర్ (చామనపల్లి ప్రభుత్వ పాఠశాల), అన్నపూర్ణ(పెద్దపల్లి ప్రభుత్వ పాఠశాల)లకు పురస్కారాన్ని అందించాము. ఈ ఏడాది స్నేహలత(కల్వచర్ల ప్రభుత్వ పాఠశాల), కె.మాధురి( బాలికోన్నత పాఠశాల, గోదావరిఖని)లకు సంయుక్తంగా పురస్కారాన్ని అందజేయాలని సంస్థ కార్యవర్గం నిర్ణయించింది. పురస్కారం కింద రెండువేల నగదు, సన్మానపత్రము, శాలువాతో సత్కరించబడును. త్వరలో కార్యక్రమ తేదిని ప్రకటిస్తాము.
ఇట్లు
కోరుకంటి చందర్( ఎమ్మెల్యే) గౌరవ అధ్యక్షులు మధుకర్ వైద్యుల (జర్నలిస్ట్) వ్యవస్థాపకులు చదువువెంకటరెడ్డి అధ్యక్షులు కట్కూరిశంకర్ వర్కింగ్ ప్రెసిడెంట్
గుడికందుల భూమయ్య ప్రధానకార్యదర్శి మందల రవింధర్ రెడ్డి సలహాదారులు

Leave a Reply

%d bloggers like this: